ETV Bharat / entertainment

'కంగువా' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - విడుదల ఎప్పుడంటే? - Kanguva New Release Date - KANGUVA NEW RELEASE DATE

Kanguva New Release Date : కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కంగువా'. అక్టోబర్‌ 10 నుంచి వాయిదా పడ్డ ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్​ను మూవీటీమ్ ప్రకటించింది.

source ETV Bharat
Kanguva New Release Date (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2024, 11:58 AM IST

Kanguva New Release Date : కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కంగువా'. శివ దర్శకత్వం వహించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ విడుదల కోసం అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్​ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అక్టోబర్‌ 10న రిలీజ్​ అవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ను చిత్ర బృందం అఫీషియల్​గా ప్రకటించింది. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనిపై సినీప్రియులు ఆనందం హర్షం చేస్తున్నారు.

వాస్తవానికి అక్టోబర్‌ 10న కంగువాను రిలీజ్​ చేయాలని మేకర్స్​ ప్లాన్ చేసి అనౌన్స్ చేశారు. అయితే అదే రోజున రజనీకాంత్‌ నటించిన వేట్టయాన్‌ రిలీజ్‌ కానున్నట్లు మరో అనౌన్స్​మెంట్ వచ్చింది. దీంతో ఈ రెండు సినిమాల పోటీ తప్పదని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా సూర్య యూటర్న్​ తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. సూర్య కూడా ఓ ఈవెంట్​లో పరోక్షంగా సినిమా వాయిదా గురించి వ్యాఖ్యలు చేశారు.

Suriya About Vettaiyan Movie : "కోలీవుడ్​ నుంచి ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని ఆడియెన్స్​ను అందించేందుకు దాదాపు రెండున్నరేళ్ల పాటు దాదాపు 1000 మందికి పైగా కంగువా కోసం కష్టపడ్డారు. డైరెక్టర్​ శివతో పాటు మూవీ టీమ్​లోని ప్రతి ఒక్కరూ క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని మరీ పని చేశారు. కష్టపడి పనిచేస్తే దాని ఫలితం ఎక్కడికీ పోదు. నేను దీన్నే నమ్ముతాను. మా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా మీరు తప్పకుండా అభిమానం, ప్రేమ చూపిస్తారనే నమ్మకం నాకు ఉంటుంది. అక్టోబర్‌ 10న రజనీకాంత్‌ నటించిన వేట్టైయాన్‌ రిలీజ్​ కానుంది. ఆ సినిమా విడుదలకు మనం దారి ఇవ్వాలి. రజనీ కాంత్‌ నాకు సీనియర్‌. నేను పుట్టే సమయానికే ఆయన యాక్టింగ్‌లోకి వచ్చేశారు. కాబట్టి ఆయన చిత్రమే ముందువస్తే బాగుంటుందని నా అభిప్రాయం" అని సూర్య చెప్పుకొచ్చారు.

'గేమ్​ ఛేంజర్'​ రిలీజ్ డేట్ - క్లారిటీ ఇచ్చిన తమన్​ - Game Changer Release Date

దర్శకుడు అట్లీతో సినిమా - ఎన్టీఆర్​ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ - Devara NTR about Atlee film

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.