ETV Bharat / entertainment

సూర్య 'కంగువా' సినిమా ఎడిటర్‌ అనుమానాస్పద మృతి

తుదిశ్వాస విడిచిన సూర్య 'కంగువా' సినిమా ఎడిటర్‌

Kanguva Editor Nishad Yusuf Died
Kanguva Editor Nishad Yusuf Died (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 8 hours ago

Updated : 7 hours ago

Suriya Kanguva Editor Nishad Yusuf Died : ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ 'కంగువా' సినిమాకు పనిచేసిన ప్రముఖ ఎడిటర్‌ నిషాద్‌ యూసుఫ్‌ కన్నుమూశారు. 43 ఏళ్ల నిషాద్‌ కేరళ పనమ్​పిల్లీ నగర్​లోని తన అపార్ట్​మెంట్​లో మరణించారు. అయితే మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. నిషాద్​ బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అర్ధ రాత్రి 2 గంటల సమయంలో ఆయన మరణించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత నిషాద్​ మృతదేహాన్ని ఎర్నాకులం జనరల్ ఆస్పత్రికి తరలించనున్నారట.

కాగా, నిషాద్​ థల్లుమాలా, చావెర్​, ఉండా, సౌదీ వెళ్లాక, వన్​, ఆపరేషన్ జాావా, చిత్రాలకు ఎడిటర్​గా పని చేశారు. చివరిగా బజూక, కంగువా సినిమాలకు ఎడిటర్​గా వ్యవహరించారు. థల్లుమల్లా సినిమాకు గానూ 2022లో నిషాద్​ బెస్ట్ ఎడిటర్​గా నేషనల్​ అవార్డ్​ను అందుకున్నారు. త్వరలోనే మమ్ముట్టి నటించిన 'బజూక', సూర్య నటించిన 'కంగువా' చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

ఇకపోతే నిషాద్ యూసుఫ్ స్వస్థలం చంగనస్సేరి. నిషాద్​ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కొచ్చిలోని పనంబిల్లి నగర్‌లో నివాసం ఉండేవారు.

మహేశ్ బాబు రామ్​పోతినేని సినిమా - లేటెస్ట్ అప్డేట్ ఇదే

మొన్న 'పుష్ప 2'- ఇప్పుడు 'గేమ్​ఛేంజర్'​ - రికార్డ్​ ధరకు హిందీ రైట్స్​!

Last Updated : 7 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.