Suriya Apologized Media : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్లో తెరకెక్కిన సినిమా 'కంగువా'. శవ దర్శకత్వంలో ఇది పాన్ఇండియా లెవెల్లో తెరకెక్కింది. నవంబర్ 14న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే మూవీటీమ్ ముంబయిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే ఈ మీట్లో సూర్య మీడియాకు సారీ చెప్పి, ఆశ్చర్యపరిచారు. మరి ఆయన సారీ ఎందుకు చెప్పారంటే?
ముంబయి ప్రెస్‌మీట్‌కు బయల్దేరిన సూర్య సమయానికి అక్కడకు చేరుకోలేదు. పలు కారణాల వల్ల ఆయన ఈ సమావేశానికి గంట ఆలస్యంగా వెళ్లారు. దీంతో ఆయన మీడియాకు క్షమాపణలు చెప్పారు. 'ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యిందని సాకులు చెప్పను. మీ అందరి సమయానికి నేను విలువనిస్తాను. అయితే దీన్ని నేను నియంత్రించలేకపోయా' అని సూర్య చెప్పారు.
What a star 🌟
— Ashwani kumar (@BorntobeAshwani) November 12, 2024
Superstar #Suriya apologised for the late arrival and the ruckus incident for his bodyguard. 👏
Its just 2 days and #Kanguva coming on the screens 🔥@Suriya_offl https://t.co/VxjfdIkTIh pic.twitter.com/ggNMwy5ViV
ఇక మీటింగ్‌లో సినిమాపై పలు ప్రశ్నలకు సూర్య సమాధానమిచ్చారు. కంగువా పార్ట్ 2 గురించి కూడా మాట్లాడారు. పార్ట్ 1 కోసం ఎంతలా ఎదురుచూశారో, రెండో భాగం కోసం అంతకంటే ఎక్కువ ఆత్రుతతో వెయిట్ చేస్తారు. 'పార్ట్ 1 క్లైమాక్స్‌లో అనేకమైన ఆశ్చర్యకర ప్రశ్నలు ఉంటాయి. వాటన్నిటికీ పార్ట్ 2లోనే ఆన్సర్ ఉంటుంది. అందుకే మీతోపాటు రెండో భాగంగ కోసం నేనూ ఎదురుచూస్తున్నా' అని పేర్కొన్నారు.
10వేల స్క్రీన్స్
ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల వెల్లడించారు. 'కంగువా'ను 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నాం. వీటిలో చాలా స్క్రీన్లు ఇప్పటికే కన్ఫార్మ్ అయ్యాయి. సౌత్‌లో 2500 కంటే ఎక్కువ , నార్త్‌లో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నామని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాం. నవంబర్ 14న మొత్తం 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకు రానుంది' అని నిర్మాత ధనుంజయ్ వెల్లడించారు.
కాగా ఈ సినిమా కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా సిద్ధమైంది. ఇందులో సూర్య ఆరు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ హీరోయిన్గా నటించింది. బాబీ దేవోల్ కీలక పాత్ర పోషించారు. సీనియర్ నటుడు జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
1500 ఏళ్ల నాటి ప్రపంచం, రూ.300 కోట్ల బడ్జెట్ - 'కంగువా' 10 ఆసక్తికర విశేషాలివే!
'బాహుబలి సినిమాకు స్ఫూర్తి సూర్యనే- ఆయనతో సినిమా చేయాలకున్నా కానీ!'