ETV Bharat / entertainment

రజనీకాంత్ హెల్త్ అప్డేట్​ - స్టెంట్‌ వేసిన వైద్యులు- మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్! - Rajnikanth Health Update - RAJNIKANTH HEALTH UPDATE

Rajnikanth Hospitalized : తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్‌ హెల్త్ అప్డేట్ వచ్చింది. ఇంతకీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?

source ETV Bharat
Rajnikanth Health Update (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2024, 1:20 PM IST

Rajnikanth Health Update : తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సర్జరీ పూర్తైనట్లు తెలుస్తోంది. మంగళవారం(అక్టోబర్ 1) ఉదయం వైద్యులు ఆయన పొత్తి కడుపులో స్టెంట్‌ వేసినట్లు తెలిసింది. తాజాగా అపోలో వైద్యలు ఈ విషయంపై ఓ మెడికల్ రిపోర్ట్​ను వెలువరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి, ఆ తర్వాత డిశ్చార్జ్‌ అవుతారని ఆ స్టేట్​మెంట్​లో డాక్టర్లు పేర్కొన్నారు.

మరోవైపు రజనీ కాంత్​ ఆరోగ్యంపై ఆయన భార్య లతా కూడా స్పందించారు. ప్రస్తుతం రజనీకాంత్​ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని స్పష్టత ఇచ్చారు. కాగా, రజనీకాంత్‌ హాస్పిట్​లో చేరారంటూ వార్తలు రావడం వల్ల ఆయన ఫ్యాన్స్​ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇక ఇప్పుడు ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడం వల్ల ఫ్యాన్స్​ ఊపిరి పీల్చుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా రజనీ వీలైనంత త్వరగా​ కోలుకోవాలని పోస్ట్‌లు పెడుతున్నారు.

Rajinikanth Vettaiayan Movie : కాగా, ప్రస్తుతం ఆయన 'వేట్టయాన్‌', 'కూలీ' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'వెేట్టయాన్‌' అక్టోబర్‌ 10న విడుదల కానుంది. రీసెంట్​గానే ఈ చిత్ర టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇందులో ఆయన పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ ఆఫీసర్​గా నటిస్తున్నారు. సినిమాలో విలన్‌గా రానా దగ్గుబాటి కనిపిస్తారని అంటున్నారు. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి.జ్ఞాన్​వేల్ దర్శకత్వం వహించారు.

Rajinikanth Coolie Movie : ఇక 'కూలి' సినిమ విషయానికొస్తే యాక్షన్‌ థ్రిల్లర్​గా ఇది ముస్తాబవుతోంది. నాగార్జున, శ్రుతిహాసన్‌, సౌబిన్‌ షాహిర్‌ సత్యరాజ్‌, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీ కాంత్‌కు ఇది 171వ చిత్రం. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. కూలీ సినిమాలో నెంబర్‌ 1421గా రజనీకాంత్‌ దేవా పాత్ర పోషిస్తుండగా, చేస్తుండగా సైమన్‌గా నాగార్జున కనిపించనున్నారు.

రజనీకాంత్‌ 'వేట్టాయన్‌' సెన్సార్‌ రిపోర్ట్ ఇదే - ఆ మూడు సంభాషణలపై అభ్యంతరం - Vettaiyan Movie Sensor

'గోపాల గోపాల' నటుడు మిథున్‌ చక్రవర్తికి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు - Mithun Chakraborty Dadasaheb Phalke

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.