ETV Bharat / entertainment

సమంతను చూసి భయపడిపోయాను - తను అలాంటి వ్యక్తి! : సుహాస్ - SUHAS SAMANTHA

Suhas Samantha : టాలీవుడ్ మరో నేచురల్ హీరో సుహాస్​ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్​లో మంచి ఫామ్​లో ఉన్నారు. అయితే ఈయన తాజాగా హీరోయిన్ సమంత గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమంతను అలా చూసి తాను భయపడిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు.

సమంతను చూసి భయపడిపోయాను - తను అలాంటి వ్యక్తి!  : సుహాస్

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 11:38 AM IST

Suhas Samantha : షార్ట్ ఫిలిమ్స్​తో కెరీర్​ ఆరంభించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా హీరోగా కెరీర్​లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్​ యాక్టర్​​ సుహాస్. ఇప్పుడు ఈయన సినిమాలకు క్రమక్రమంగా గిరాకీ పెరుగుతోంది. ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. దీంతో బాక్సాఫీస్ ముందు ఈయన చిత్రాలకు మంచి వసూళ్లే వస్తున్నాయి.

అప్పటివరకు హీరోల ఫ్రెండ్స్​ క్యారెక్టర్​లో లేదంటే ఇతర పాత్రల్లో నటించిన సుహాస్​ కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారారు. అలా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుని సక్సెస్​ను ఖాతాలో వేసుకున్నారు. అనంతరం మళ్లీ భిన్నమైన సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూనే ముందుకు వెళ్లారు. మధ్య మధ్యలో తనకు హీరోగా అవకాశం వచ్చినప్పుడల్లా తన టాలెంట్​ను ప్రూవ్ చేసుకుంటూనే ఉంటున్నారు. అలా రైటర్ పద్మభూషణ్, రీసెంట్​గా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్​తో లేడీ ఆడియెన్స్​ను మనసులను దోచుకున్నారు. ఈ జర్నీలోనే హిట్ 2 సహా మరో వెబ్​సిరీస్​లో నెగటివ్ షేడ్స్​ ఉన్న సైకో పాత్రలను కూడా పోషించి మెప్పించారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన హీరోయిన్ సమంత గురించి మాట్లాడాడు. "సమంతను మొదటిసారి చూసినప్పుడు బాగా భయపడ్డాను. ఎలా ఉంటారో, ఏం మాట్లాడతారో అని అనుకున్నాను. నీకు ఫస్ట్ బ్రేక్ తప్పకుండా వస్తుంది. సక్సెస్ అవుతావ్ అని ఆమె నాతో చెప్పింది. తొలిసారి అలా అన్న వ్యక్తి ఆమెనే. ఆమె చెప్పినట్టుగానే జరిగింది. ఓ సారి షూటింగ్​లో సమంతను చాలా మంది కలిసి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆమె చుట్టూ వాలిపోయారు. చూపించారు. ఆమె చాలా మంది ప్రేమను పొందింది. ఎంతో కష్టపడితేనె గానీ ఈ స్థాయికి వెళ్లలేం. ఆమె అంటే నాకు చాలా గౌరవం" అని చెప్పాడు.

ఇకపోతే సుహాస్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ప్రసన్న వదనం, గొర్రె పురాణం, శ్రీరంగనీతులు, ఆనందరావు అడ్వెంచర్స్ వంటి సినిమాలు చేస్తున్నారు. ఇంకా దిల్ రాజు నిర్మాణ సంస్థలోనూ ఓ చిత్రం చేస్తున్నారు. తాజాగా ఉప్పు కప్పురంబు అనే సినిమాను ప్రకటించారు. ఇందులో మహానటి కీర్తి సురేశ్ నటించడం విశేషం.

జపాన్​లో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజమౌళి కొడుకు! - లేదంటేనా?

పాత్ర కోసం ప్రాణం పణంగా పెట్టిన స్టార్ హీరో - 72గంటల పాటు కేవలం నీళ్లనే తాగి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.