ETV Bharat / entertainment

స్టార్ హీరో ఇంట్లోకి అద్దెకు దిగుతున్న శ్రద్ధా కపూర్​ - వామ్మో నెలకు అన్ని లక్షలా? - Shraddha Kapoor New House

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 1:07 PM IST

Shraddha Kapoor New Apartment : రీసెంట్​గా 'స్త్రీ 2' చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకున్న శ్రద్ధా కపూర్​ ముంబయిలో ఓ సీ ఫేసింగ్​ ఉన్న కొత్త ఇంట్లోకి అద్దెకు దిగుతోందని తెలిసింది. అయితే ఆ లగ్జరీ అపార్ట్​మెంట్​​ ఓ స్టార్ హీరోది అని తెలిసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Shraddha Kapoor
Shraddha Kapoor (Getty Images)

Shraddha Kapoor New Apartment : బాలీవుడ్‌ బాక్సాఫీస్​ ముందు తాజాగా సంచలనం సృష్టించింది 'స్త్రీ 2' సినిమా. ఈ చిత్రం ఇంకా థియేటర్లలో సక్సెస్​ ఫుల్​గా రన్​ అవుతూనే ఉంది. ఇందులో 'సాహో' బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించింది. అక్షయ్​ కుమార్​ గెస్ట్​ రోల్​లో కనిపించారు. అయితే ఇప్పుడీ భామ సీ ఫేసింగ్​ ఉన్న కొత్త ఇంట్లోకి వెళ్తోందని తెలిసింది. అయితే ఆ లగ్జరీ అపార్ట్​మెంట్​​ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్​ది అని తెలిసింది. ఇది​ జుహు ప్రాంతంలో ఉందట.

'స్రీ 2' బాక్సాఫీస్​ దగ్గర భారీ వసూళ్లను సాధించిన తర్వాత శ్రద్ధా కపూర్​ ఈ కొత్త ఇంటిని వెతుక్కుందట. ఈ ఇంటికి ఆమె నెలకు లక్షల్లో అద్దె చెల్లించనుందని తెలిసింది. ఇకపోతే ఇదే బిల్డింగ్‌లో మరో బాలీవుడ్ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​కు లగ్జరీ డూప్లెక్స్​ అపార్ట్​మెంట్​ కూడా ఉంది. ఇది శ్రద్ధా కపూర్ ​తీసుకున్న అపార్ట్​మెంట్​కు​ పొరుగిల్లే కావడం మరో విశేషం. ఇందులో అక్షయ్​ కుమార్​ తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు.

ఈ సీ ఫేసింగ్​ అపార్ట్​మెంట్​లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయట. అలానే ట్రెడిషనల్​, మోడ్రన్​ కలిగిన వస్తువులు, ఇంకా ఉడెన్ ఫర్నిషింగ్​, గ్రీనరీ, సహజ కాంతి ఇంట్లోకి వచ్చేలా కిటీకీలు, బెడ్​ రూమ్​లో రీడింగ్​ కార్నర్​ వంటి చాలా సౌకర్యాలు ఉన్నాయట.

వాస్తవానికి ఈ అపార్ట్‌మెంట్లోకి మొదట వరుణ్ ధావన్ అద్దెకు దిగాలని అనుకున్నారట. కానీ డీల్ కుదరలేదట. ఈ క్రమంలోనే ఇప్పుడు శ్రద్ధా కపూర్​ ఈ డీల్​ను ఓకే చేసుకొని అందులోకి వెళ్లడానికి సిద్ధమవుతోందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం శ్రద్ధా కపూర్​ తన తండ్రి శక్తి కపూర్​తో కలిసి ఉంటోంది. ఆయన 1987లో జుహు ప్రాంతంలోనే ఓ అపార్ట్​మెంట్​లోని ప్లాట్​ను రూ.7 లక్షలకు కొనుగోలు చేశారట. ఇప్పుడు దాని విలువ దాదాపు రూ.60 కోట్లు ఉంటుందని సమాచారం.

Shraddha Kapoor Stree 2 Movie Collections : 'స్త్రీ 2' సినిమా విషయానికొస్తే చిత్రంలో శ్రద్ధాకపూర్‌, రాజ్‌కుమార్‌రావు నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తమ గ్రామాన్ని పట్టిపీడిస్తున్న దెయ్యాన్ని పట్టుకోవడం కోసం వాళ్లు చేసే ప్రయత్నాలు ఆడియెన్స్​ను ఉత్కంఠకు గురిచేశాయి. దీంతో ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది.

శ్ర‌ద్ధా క‌పూర్ 'స్త్రీ 2' సంచలనం - మొదటి వారంలో రికార్డ్‌ వసూళ్లు - Stree 2 Collections

షారుక్, సల్మాన్​​తో అందుకే సినిమా చేయలేదు: శ్రద్ధా కపూర్‌ - Shraddha Kapoor

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.