ETV Bharat / entertainment

వచ్చే ఐదు నెలలు స్టార్ హీరోలదే - ఏఏ సినిమాలు వస్తున్నాయంటే? - Star Heroes Upcoming Movies - STAR HEROES UPCOMING MOVIES

Star Heroes Upcoming Movies : సంక్రాంతి తర్వాత పెద్ద హీరోల సినిమాల సందడే కనిపించలేదు. వేసవిలో ఉంటుందనుకున్నా అది కూడా లేదు. కానీ రాబోయే ఐదు నెలలు మాత్రం వరుసగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు మన హీరోలు. సినీ ప్రియుల్లో ఫుల్ జోష్​ నింపనున్నారు. మరి వారు ఎవరు? ఏ చిత్రాలేంటి? రిలీజ్ ఎప్పుడు?

Star Heroes Upcoming Movies
Star Heroes Upcoming Movies
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 7:57 AM IST

Star Heroes Upcoming Movies : సంక్రాంతి తర్వాత ఒకప్పుడు వేసవిలోనే ఎక్కువ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. కానీ కొన్నేళ్లుగా అలా జరగడం లేదు. సమ్మర్ సీజన్​ను మన స్టార్ హీరోలు లైట్ తీసుకుంటున్నారు! సంక్రాంతి రిలీజ్​పై చూపించినంత ఇంట్రెస్ట్​ను వేసవిపై చూపించడం లేదు!! ఈ ఏడాది కూడా తొలుత జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్​తోపాటు మీడియం, చిన్న హీరోలు వస్తారని అంతా భావించారు.

అయితే జూనియర్​ ఎన్టీఆర్, ప్రభాస్​ తప్ప మిగతా అంతా సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర ఇప్పటికే దసరాకు వాయిదా పడగా, ప్రభాస్ కల్కి కూడా పోస్ట్ పోన్ పక్కానే. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్​ను ప్రకటించనున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ వల్ల కల్కి రిలీజ్ వాయిదా పడుతుంది. పోలింగ్, కౌంటింగ్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదంతా పక్కన పెడితే.. వేసవి తర్వాత బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలంతా క్యూకట్టేశారు. వరుసగా తమ సినిమాలతో సందడి చేయనున్నారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు ఒకరు తర్వాత ఒకరు సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్స్ పూర్తవ్వగా, మరికొన్ని స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటంటే?

కల్కి X ఇండియన్​-2!
ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ జూన్​ 14వ తేదీన రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే నెలలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు-2 విడుదల అవ్వనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కల్కిలో కూడా కమల్ గెస్ట్ రోల్​లో కనిపించనున్నారు. దీంతో ఈ రెండు కూడా బాక్సాఫీస్ వద్ద గట్టిగా తలపడనున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పుష్పతో బన్నీ రెడీ
మల‌యాళం స్టార్ మమ్ముట్టి టర్బో మూవీ కూడా జూన్​లోనే రిలీజ్ అవ్వనుంది. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. జులైలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ విడుదలను ఖరారు చేసుకుంది. ఇక ఆగస్టులో మోస్డ్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప-2 ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ గ్రాండ్​గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పుష్పరాజ్​గా మ్యాజిక్ చేసేందుకు మరోసారి రెడీ అవుతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

తారక్​కు పోటీగా రజనీ, అజిత్!
సెప్టెంబర్​లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏపీ ఎన్నికల తర్వాత పవన్ సెట్స్​లోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్​తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ తర్వాత దసరా కానుకగా తారక్ దేవర వచ్చేయనుంది. దేవర ఫస్ట్ పార్ట్​ను అక్టోబర్​ 10వ తేదీన విడుదల చేయనున్నారు మేకర్స్. అదే నెలలో రజనీకాంత్ వెట్టియాన్​(తెలుగులో వేటగాడు), అజిత్ విడా మయూర్చి కూడా రిలీజ్ కానున్నాయి.

అక్టోబర్​లో బోలెడు సినిమాలు?
వీటితోపాటు మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్​ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ కూడా అక్టోబర్​లోనే రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు సెప్టెంబర్​లో విడుదల అవుద్దని ఇప్పటికే చెప్పినా ఆ నెలలో డేట్ సెట్ కానున్నట్లు సమచారం. అందుకే అక్టోబర్​లో చరణ్ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.

ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా దసరాకే తన NBK 109 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడు కాకపోతే సంక్రాంతికి వస్తారంట బాలయ్య. మొత్తానికి జూన్ టు అక్టోబర్​ సినీప్రియులతోపాటు ఆయా హీరోల ఫ్యాన్స్​కు పండగే అని చెప్పాలి. మరి చూడాలి అన్ని సినిమాలు ఎలాంటి ఫలితం అందుకుంటాయో!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.