ETV Bharat / entertainment

'శివాజి సీక్వెల్​పై శంకర్ రిప్లై ఇదే- అలా అనిపిస్తేనే చేస్తాడంట'! - Shankar Sequels - SHANKAR SEQUELS

Shankar Sequels: స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం 'భారతీయుడు- 2' సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు 'శివాజి' సీక్వెల్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. మరి ఆయన ఏమన్నారంటే?

Shankar Shivaji Sequels
Shankar Shivaji Sequels (Source: ANI (Left), ETV Bharat (Right))
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 10:41 AM IST

Updated : Jul 3, 2024, 10:52 AM IST

Shankar Sequels: స్టార్ డైరెక్టర్ శంకర్ లేటెస్ట్ ప్రాజెక్ట్​ 'భారతీయుడు- 2' సినిమా జూలై 12న వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను 1996లో విడుదలై బ్లాక్​బస్టర్​ హిట్​ కొట్టిన 'భారతీయుడు'కు సీక్వెల్​గా డైరెక్టర్ శంకర్ పాన్ఇండియా రేంజ్​లో దీన్ని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో హిందీ ప్రమోషన్స్​లో పాల్గొన్న శంకర్​కు తాజాగా సీక్వెల్స్ గురించి ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఆయన సినిమాల్లో భారీ విజయాలు సాధించిన 'శివాజీ', 'నాయక్', 'అపరిచితుడు' కూడా సీక్వెల్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అని అడిగారు. దీనికి ఆయన ఆసక్తికరంగా బదులిచ్చారు. సరైన సబ్జెక్ట్​ ఉంటేనే తాను సీక్వెల్స్ ప్లాన్ చేస్తానని అన్నారు.

'నా సినిమాలన్నీ కామన్ మ్యాన్ పాయింట్​ ఆఫ్ వ్యూ లో ఉంటాయి. అదే సినిమా దేశవ్యాప్తంగా అందరు ఆడియెన్స్​కు కనెక్ట్ అయితే అది పాన్ఇండియా మూవీ అవుతుంది. 'శివాజీ', 'నాయక్', 'అపరిచితుడు' సినిమాలకు సీక్వెల్స్ చేయమని ప్రేక్షకులు నన్ను కూడా అడిగారు. నేనూ చేద్దామనే అనుకున్నా. కానీ, ఏదో సీక్వెల్ తీయాలి కాబట్టి చేద్దాం అనుకోను. సబ్జెక్ట్ నాకు కనెక్ట్ అవ్వాలి. అప్పుడే వాటి గురించి ఆలోచిస్తా' అని అన్నారు.

దీంతో శంకర్ నుంచి సీక్వెల్ రావడానికి చాలా సమయం పట్టవచ్చు, ఒకవేళ రాకపోవచ్చు. ఆయన ఇప్పట్లో సీక్వెల్స్ తీసే ఆలోచనలో లేరని ఆ రిప్లై చూస్తే అర్థమవుతోంది. ఇక భారతీయుడు తర్వాత శంకర్ 'గేమ్ ఛేంజర్'పై దృష్టి పెట్టనున్నారు. ఈ సినిమా దాదాపు 90 శాతం పూర్తయ్యిందని సమాచారం. రామ్​చరణ్ హీరోగా పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్​డ్రాప్​లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఇంకో 10- 15 రోజులు షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. దీని తర్వాత ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

ఇక భారతీయుడు- 2 విషయానికొస్తే, ఇప్పటికే రిలీజైన ట్రైలర్, వీడియో గ్లింప్స్, పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాలో కమల్​హాసన్​తోపాటు రకుల్​ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియాభవాని శంకర్, సిద్ధార్థ్, వేణు, ఎస్​జే సూర్య తదితరులు నటించారు.

కమల్​ హాసన్ దగ్గరున్న ఈ 5 అల్ట్రా కాస్ట్లీ​ ప్రాపర్టీస్ తెలుసా!? - Kalki 2898 AD Kamal Hassan

'భారతీయుడు 2' ట్రైలర్ డేట్ లాక్- రిలీజ్ ఎప్పుడంటే?

Last Updated : Jul 3, 2024, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.