ETV Bharat / entertainment

మళ్లీ నయా లుక్​లో మహేశ్ - ఈ సారి మరింత స్టైలిష్​గా! - Mahesh Babu New Stylish look - MAHESH BABU NEW STYLISH LOOK

Mahesh Babu New Stylish look : సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి కొత్త లుక్స్​లో కనిపించి ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన న్యూ పిక్స్​ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. మీరు చూశారా?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 8:09 AM IST

Mahesh Babu New Stylish look : ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన సూపర్ స్టార్ మహేశ్​ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే సినిమా SSMB 29 కోసం సిద్ధం అవుతున్నారు. జక్కన్నతో సినిమా అంటే దాదాపుగా మూడు నాలుగేళ్లు పట్టేస్తుంది. అయితే ఆ మధ్య రాజమౌళి - బయట ఎక్కడా కనిపించకూడదంటూ సూపర్ స్టార్​కు కండిషన్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మహేశ్ అభిమానులు కాస్త ఫీలయ్యారు. కానీ మహేశ్​ మాత్రం అలా ఏమీ కాకుండా ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే మరింత గ్లామర్​గా లేటెస్ట్ లుక్స్​ పోస్ట్ చేస్తూ కనువిందు చేస్తున్నారు. తాజాగా మరో ఫొటోషూట్​తో కనిపించి అదరగొట్టేశారు. సింపుల్​గా ప్లెయిన్​ గ్రీన్ కలర్ టీషర్ట్​లో కనిపించి ఆకట్టుకున్నారు. మరో పిక్​లో లైట్ బ్లూ కలర్​ చెక్స్ షర్ట్​లో సూపర్​గా కనిపించారు. ముఖ్యంగా ఆయన మెయిన్ టెయిన్​ చేస్తున్న లాంగ్​ హెయిర్ భలే ఉంది. పొదల మధ్యలో ఈ ఫొటోషూట్ చేసినట్లు బ్యాక్​గ్రౌండ్ చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఇవే కనపడుతున్నాయి. ఫ్యాన్స్ మరోసారి వీటిని చూస్తూ ఫిదా అయిపోతున్నారు.

ఇకపోతే మహేశ్ నటించిన చివరి సినిమా గుంటూరు కారం బాక్సాఫీస్ ముందు అంతగా హిట్ టాక్ తెచ్చుకోలేదు. డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ వసూళ్లు బానే వచ్చినట్లు మూవీటీమ్ చెబుతోంది. అయితే ఈ మూవీ రిజల్ట్​ను పక్కన పెట్టేసి రాజమౌళి మూవీ కోసం సన్నద్ధం అవుతున్నారు మహేశ్. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తైపోయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్టిస్టులను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే మూవీ సెట్స్​పైకి వెళ్లనుంది.

ఇక ఈ చిత్రంలో మహేశ్​ కోసం ఎనిమిది రకాల లుక్స్​ను రెడీ చేశారట. అందులో ఒకటి ఫైనలైజ్ చేయనున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్​ బ్యాక్​డ్రాప్​తో భారీ బడ్జెట్​తో సినిమాను నిర్మించనున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్​ అని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలీదు.

అల్లు అర్జున్ - అట్లీ మూవీలో హీరోయిన్​ ఎవరంటే? - Atlee Allu Arjun Movie

'వార్​ 2'లో మరో తెలుగు స్టార్ - ఈ క్యారెక్టర్ చాలా పవర్​ఫుల్​! - Jr NTR War 2 Cast

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.