ETV Bharat / entertainment

'SSMB' షూటింగ్ లొకేషన్ కోసం జక్కన్న సెర్చింగ్! - వైరల్ అవుతున్న ఇన్​స్టా పోస్ట్! - RAJAMOULI SSMB 29

ఎడారిలో రాజమౌళి - 'SSMB 29' కోసమే అంటున్న ఫ్యాన్స్!

SSMB 29
SSMB 29 (Getty Images, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2024, 12:45 PM IST

SS Rajamouli SSMB 29 : ప్రస్తుతం టాలీవుడ్​లో తెగ ట్రెండ్ అవుతున్న టాపిక్స్​లో 'SSMB 29' ఒకటి. ఈ సినిమా కోసం అటు మహేశ్​ ఫ్యాన్స్​తో పాటు సినీ లవర్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క అఫీషియల్ అప్డేట్ ఇప్పటి వరకూ రాకపోవడం వల్ల అభిమానులు కూడా ఒకింత నిరాశ చెందుతున్నారు. అయితే తాజాగా డైరెక్టర్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్​ వల్ల 'SSMB 29' మళ్లీ ట్రెండింగ్​లోకి వచ్చింది. ఇంతకీ ఆయన ఏం పోస్ట్ షేర్ చేశారంటే?

ఎడారిలో అలా!
ప్రస్తుతం మూవీ టీమ్ మొత్తం 'SSMB29' చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో రాజమౌళి రీసెంట్​గా సోషల్ మీడియాలో అప్​లోడ్ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎడారి ప్రాంతంలో ఆయన తిరుగుతున్నట్లు ఓ ఫొటో షేర్‌ చేశారు. దానికి "కనుగొనడం కోసం తిరుగుతున్నా" అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్​ను జోడించారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆయన మహేశ్‌ సినిమా కోసం లొకేషన్స్‌ సెర్చ్‌ చేయడానికే అక్కడికి వెళ్లారంటూ కామెంట్లు పెడుతున్నారు. యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్​ అవ్వడం వల్ల కచ్చితంగా ఆయన ఈ పని మీదనే వెళ్లారని అంటున్నారు. త్వరగా అప్‌డేట్‌ ఇవ్వండి అంటూ నెట్టింట రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే అంతకుముందు రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఎడారికి సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. అవి కూడ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి.

ఇక 'SSMB 29' విషయానికి వస్తే, అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పలు భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీన్ని రిలీజ్ చేయనున్నారట. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇక మునుపెన్నడు లేని సరికొత్త లుక్‌లో మహేశ్‌ కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన ఇప్పటికే చాలా వరకూ సన్నద్ధమయ్యారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం కాబట్టి ఆ అంచనాలను దృష్టిలోపెట్టుకొనే జక్కన్న ప్రతిదాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. అందుకే ప్రీ ప్రొడక్షన్‌ పనులను కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ వేదికపై 'SSMB 29' మేనియా - హింట్ ఇస్తూనే హైప్ పెంచిన జక్కన్న!

మహేశ్, రాజమౌళి మూవీ అప్డేట్- SSMB29 ఒకటి కాదు రెండు పార్ట్​లుగా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.