ETV Bharat / entertainment

'శ్రీమంతుడు' కథపై వివాదం - కొరటాల శివకు సుప్రీంలో చుక్కెదురు - కొరటాల శివ శ్రీమంతుడు కేసు

Srimanthudu Koratala Siva : శ్రీమంతుడు సినిమా కథ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగింది. ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివకు చుక్కెదురైంది. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 7:05 PM IST

Srimanthudu Koratala Siva : సూపర్ స్టార్​ మహేశ్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో గతంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీమంతుడు'. 2015లో విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అయితే ఈ మూవీ స్టోరీ విషయంలో గత ఏడేళ్లుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడిదే విషయంలో సుప్రీం కోర్టులోనూ దర్శకుడు కొరటాల శివకు చుక్కెదురైంది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్‌ కేసును ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఇదీ జరిగింది : 'శ్రీమంతుడు' కథను స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారంటూ రచయిత శరత్‌ చంద్ర గతంలో హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ, కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

ఆ తర్వాత మళ్లీ 'శ్రీమంతుడు' కథను కాపీ కొట్టారంటూ ఉన్న ఆధారాలను రచయిత శరత్‌ చంద్ర కోర్టుకు సమర్పించారు. అవి నిజమైనవేనని నిర్ధారిస్తూ రచయితల సంఘం కూడా నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు, నాంపల్లి న్యాయస్థానం ఉత్తర్వులను సమర్థించింది.

దీంతో కొరటాల శివ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సినిమా రిలీజైన 8 నెలల తర్వాత రచయిత శరత్‌ చంద్ర కోర్టును ఆశ్రయించారని, హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు ఉన్నాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. 'పిటిషన్‌ను మమ్మల్ని డిస్మిస్‌ చేయమంటారా? లేక మీరే వెనక్కి తీసుకుంటారా' అని న్యాయవాది నిరంజన్‌రెడ్డిని కోర్టు ప్రశ్నించింది. దీంతో తామే పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని చెప్పడం వల్ల అందుకు అనుమతి ఇచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మెగాస్టార్ సరసన హనీరోజ్​​ - ఏ సినిమాలో అంటే?

OTTలోకి సెన్సేషనల్​ రియల్ క్రైమ్ థ్రిల్లర్ - ఎక్కడ చూడాలంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.