ETV Bharat / entertainment

OTTలోకి శోభిత ధూళిపాళ్ల లవ్, హార్ట్​ బ్రేక్​ స్టోరీ! - ఆ రోజు నుంచే స్ట్రీమింగ్​ - Sobhita Dhulipala Love Sitara OTT - SOBHITA DHULIPALA LOVE SITARA OTT

Sobhita Dhulipala Love Sitara OTT : హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల లవ్ అండ్​ హార్ట్​ బ్రేక్ స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్​ అయ్యేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలు స్టోరీలో

source Nagarjuna twitter and Getty Images
Sobhita Dhulipala Love Sitara OTT (source Nagarjuna twitter and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 4:50 PM IST

Sobhita Dhulipala Love Sitara Movie OTT : సౌత్​తో పాటు బాలీవుడ్‌లోనూ ప్రాజెక్ట్‌లు చేస్తూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది నటి శోభిత ధూళిపాళ్ల. అయితే రీసెంట్​గా ఆమె నాగ చైతన్యతో ఎంగేజ్​మెంట్​ చేసుకున్నాక వార్తల్లో మరింత ఎక్కువగా నిలుస్తూ వస్తోంది. ఆమెకు సంబంధించిన పర్సనల్​ అండ్ ప్రొఫెషనల్​(సినిమా) విషయాలను తెలుసుకునేందుకు సినీ ప్రియులు మరింత ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే తాజాగా శోభిత ధూళిపాళ్ల నటించిన ఓ రొమాంటిక్ ఎమోషనల్​ డ్రామా సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అది కూడా డైరెక్ట్​ ఓటీటీ రిలీజ్​కు రెడీ అయింది. దాని పేరు 'లవ్ సితార'. ఈ చిత్రంలో రాజీవ్ సిద్ధార్థ్ లీడ్ రోల్​లో నటించారు.

ఈ లవ్ సితార సినిమా సెప్టెంబర్ 27 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. సంప్రదాయ వస్త్రధారణలో శోభితా ధూళిపాళ్ల నవ్వుతూ ఉన్న ఓ పోస్టర్‌ను పోస్ట్ చేసి ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అఫీషియల్​గా తెలిపింది. "ఈ చిత్రం లవ్, హార్ట్ బ్రేక్, సెల్ఫ్ డిస్కవరీకి సంబంధించిన కథ. సెప్టెంబర్ 27న లవ్ సితార జీ5లోకి రానుంది" అని రాసుకొచ్చింది.

ఈ లవ్ సితార సినిమాను వందన్ కటారియా డైరెక్ట్ చేశారు. సినిమాతో శోభిత, రాజీవ్‍తో పాటు రిజుల్ రే, శంకర్ ఇంద్రఛూడన్, సీమా సాన్వీ కూడా నటించారు. ఆర్ఎస్‍వీపీ బ్యానర్​పై రోనీ స్క్రీవాలా నిర్మించారు. మోస్తరు బడ్జెట్‍తో చిత్రాన్ని రూపొందించారు. కాగా, 2020లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ కరోనా సహా ఇతర కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. కాగా, ఈ చిత్రం ప్రేమ, భావోద్వేగాలు, యాక్సప్టెన్స్, క్షమించడం చుట్టూ సాగుతుందని అంటున్నారు.

ఆ సినిమా కూడా - ఇంకా ఇదే జీ5లో సెప్టెంబర్ 13 నుంచి బెర్లిన్ అనే చిత్రం కూడా డైరెక్ట్​ స్ట్రీమింగ్​కు రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో ఇశ్వాక్ సింగ్, అపర్‌శక్తి ఖురానా, రాహుల్ బోస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంకా కబీర్ బేడీ, అనుప్రియ గోయెంక కూడా నటించారు. అతుల్ సబర్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ దీన్ని నిర్మించింది.

ఆ విషయంలో షారుక్​ ఖాన్‍ను బీట్​​ చేసిన శోభిత ధూళిపాళ్ల - Sobhita Dhulipala Sharukh Khan

నాగచైతన్య- శోభిత పెళ్లి ఎప్పుడు? నాగార్జున రిప్లై ఇదే! - Naga Chaitanya Sobhita

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.