ETV Bharat / entertainment

గ్రాండ్​గా మహేశ్ కుమార్తె బర్త్​డే - బిగ్​ కేక్​ చూసి సితార ఎగ్జైట్​మెంట్​! - Sitara Ghattamaneni Birthday Party - SITARA GHATTAMANENI BIRTHDAY PARTY

Sitara Ghattamaneni Birthday Party : సూపర్​స్టార్​ మహేశ్​ బాబు కుమార్తె సితార బర్త్​డే వేడుకలు గ్రాండ్​గా జరిగాయి. దీనికి సంబంధించిన ఫొటోలను మీరూ చూసేయండి.

Sitara Ghattamaneni Birthday Party
Sitara Ghattamaneni (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 6:46 AM IST

Updated : Jul 21, 2024, 8:23 AM IST

Sitara Ghattamaneni Birthday Party : టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్​ బాబు గారాల పట్టి సితార బర్త్​డే నిన్న (జులై 20) గ్రాండ్​గా జరిగింది. తనముందు ఉన్న పెద్ద కేక్​ను చూసి ఎగ్జైట్​ అవుతున్న సితార ఫొటోను తన తల్లి నమ్రత శిరోద్కర్​ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

"నా అందాల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. నువ్వు క‌నే క‌ల‌లన్నీ నిజం కావాలని కోరుకుంటున్నారు. నీ మ‌న‌సు బంగారం త‌ల్లీ." అంటూ ఓ స్వీట్ క్యాఫ్షన్​ను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్​ కూడా సితారకు బర్త్​డే విషెస్​ తెలుపుతూ నెట్టింట సందడి చేశారు.

అంతకు ముందు మహేశ్​ బాబు సోషల్ మీడియా వేదికగా సిచార విష్ చేశారు. సితార లేటెస్ట్ ఫొటో షేర్ చేసి 'హ్యాపీ 12 మై సన్‌షైన్‌' అని పేర్కొన్నారు. నమ్రత శిరోద్కర్ కూడా ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేశారు. సితార చిన్నప్పటి ఫొటోలతో పాటు కొన్ని స్పెషల్ వీడియోలతో ఆ వీడియోను ఎంతో క్రియేటివ్​గా ఎడిట్ చేశారు.

"నా చిట్టి ట్రావెల్​ పార్ట్నర్​కి జన్మదిన శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు నువ్వు ఎప్పుడూ నాకు ఓ ట్రావెల్‌ గైడ్‌లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాలు, జ్ఞాపకాలను నేను సెలబ్రేట్‌ చేసుకుంటున్నా. ఐ లవ్‌ యూ మై స్వీట్‌హార్ట్‌" అని నమ్రత తన కుమార్తె కోసం ఓ క్యాప్షన్‌ రాసుకొచ్చారు.

ఇక సితార విషయానికి వస్తే, మహేశ్ బాబు గారాలపట్టి అయిన ఈ చిన్నారి తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటుంది. ఇటీవల ఓ నగల దుకాణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించగా, ఆ యాడ్ ద్వారా తనకు వచ్చిన పారితోషకాన్ని సామాజిక సేవల కోసం ఉపయోగించింది. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ డ్యాన్స్ రీల్స్ అలాగే స్పెషల్ ఫొటోస్​ను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే డ్యాన్స్‌లోనూ శిక్షణ కూడా తీసుకుంటోంది. మహేశ్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'సర్కారు వారి పాట' సినిమాలో పైసా అంటూ సాగే సాంగ్​ ద్వారా స్క్రీన్​పై మెరిసింది. అందులో తన ఎనర్జిటిక్ స్టెప్పులకుగానూ ప్రశంసలు అందుకుంది.

సితార ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాకే- మహేశ్​, నమ్రత అస్సలు స్ట్రిక్ట్ కారట! - Sitara Ghattamaneni Favourites

Sitara birthday: సి'తార' దిగివచ్చిన వేళ..! మహేశ్​బాబు కూతురు సితార పుట్టిన రోజున ఏం చేసిందో తెలుసా..!

Last Updated : Jul 21, 2024, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.