Siddhu Jonnalagadda Dj Tillu Square VS Vijay Devarkonda Family Star : టాలీవుడ్ యంగ్ హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ వేర్వేరుగా నటించిన టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు గత రెండు వారాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రదర్శన అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు దాదాపు క్లోజింగ్ టైమ్‌కు వచ్చేశాయి. ఈ రెండింటిలో ఫ్యామిలీ స్టార్‌పై టిల్లన్న ఆధిపత్యం కొనసాగించాడు.
Tillu Square Collections : రిలీజైన తొలి రోజు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ముందు మోత మెగించాడు టిల్లన్న. రోజురోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ పోయి వరల్డ్ వైడ్‌గా ఎనిమిది, తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించాడు. రెండో వారంలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదలైన డామినేట్ చేస్తూ దూసుకెళ్లాడు. అలా 14వ రోజు రంజాన్ సందర్భంగా కూడా కాస్త దూకుడు ప్రదర్శించి మంచి వసూళ్లను అందుకున్నాడు. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ చిత్రం 14 రోజుల్లో రూ.65 కోట్ల నెట్(ఇండియా) వసూలు చేసిందని తెలిసింది. వరల్డ్ వైడ్‌గా రూ.61 కోట్ల వరకు షేర్, రూ.100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం అందింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Family Star Collections : ఇక ఫ్యామిలీ స్టార్ మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీ పెరిగిపోయింది. నిర్మాత దిల్ రాజు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్‌కు వెళ్లి మూవీటీమ్ కంప్లైంట్ కూడా చేసింది. అయినా ఈ చిత్రంపై నెగటివ్ ప్రచారం ఆగలేదు. సినిమా బాలేదన్న రివ్యూలే ఎక్కువగా కనిపించాయి. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. తొలి రోజు రూ.5 కోట్ల వరకు వసూలు చేసిన ఈ మూవీ వారం రోజుల్లో రూ.17 కోట్ల నెట్(ఇండియా), వరల్డ్ వైడ్‌గా రూ.15 కోట్ల వరకు షేర్, రూ.27 వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయని తెలిసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'ఆ స్టార్ హీరో రమ్మంటే అన్నీ వదిలేసి వెళ్లిపోతా' - Priyamani
ఫ్రైడే స్పెషల్ - OTTలోకి ఒక్కరోజే 11 ఆసక్తికర సినిమాలు! - This Week OTT Releases