ETV Bharat / entertainment

టిల్లన్న డామినేషన్​ - మూడు రోజుల్లోనే రూ.100కోట్ల దిశగా స్టార్ బాయ్ - DJ Tillu Square Day 3 Collections - DJ TILLU SQUARE DAY 3 COLLECTIONS

DJ Tillu Square Collections : మూడో రోజు కూడా టిల్లు స్క్వేర్​ అదిరిపోయే వసూళ్లను సాధించింది. దీంతో ఈ చిత్రానికి మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 12:44 PM IST

Updated : Apr 1, 2024, 1:52 PM IST

Siddhu Jonnalagadda Anupama Parameshwaran DJ Tillu Square Collections : సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ రెస్పాన్స్ అస్సలు తగ్గట్లేదు. వీకెండ్​లో అదిరిపోయే వసూళ్లు సాధించింది. దీంతో హాఫ్​ సెంచరీ దాటేశాడు టిల్లు స్క్వేర్​. ప్రస్తుతం సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.

తొలి రోజే రూ. 23 కోట్లకు పైగా గ్రాస్​ వసూళ్లను సాధించిన ఈ చిత్రం డే 2 కూడా అంతకుమించి కలెక్షన్లను అందుకుంది. సినిమాకు పెట్టిన బడ్జెట్​ మించి వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు రోజుల్లో రూ.45.3 కోట్ల గ్రాస్​ అందుకుంది. ఇక ఆదివారం సెలవ రోజు కావడం వల్ల మరింత భారీ వసూళ్లు వచ్చాయి. మూడు రోజుల్లోరూ. 68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీటీమ్ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది.

ఇకపోతే స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఈ టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. తన బాడీ లాంగ్వేజ్​తో మరోసారి ప్రేక్షకులను బాగా నవ్వించాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇంతకాలం డీసెంట్​ పాత్రలతో ఆడియెన్స్​ మెప్పించే అనుపమ పరమేశ్వరన్​ ఈ మధ్య బోల్డ్​ డోస్​ పెంచుతోంది. అలా ఈ టిల్లు స్క్వేర్​లో లిప్ లాక్, రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించింది. ఈ జోడీ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ అనుపమపై మాత్రం తీవ్రంగా నెగటివ్​ టాక్​ వస్తోంది.

ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య గ్రాండ్​గా నిర్మించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. బడ్జెట్​ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారని అర్థమవుతోంది. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, తమన్ సంగీతం అందించారు. ఫస్ట్ పార్ట్​ హీరోయిన్​ నేహా శెట్టి ఈ రెండో పార్ట్​ క్లైమాక్స్​లో గెస్ట్ రోల్​లో కనిపించి ఆకట్టుకుంది. ప్రిన్స్, మురళిధర్ కూడా ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి మూడో పార్ట్ కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసేశారు. టిల్లు క్యూబ్ టైటిల్​ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఈ వారమే విజయ్ ఫ్యామిలీ స్టార్, ​మంజుమ్మల్‌ బాయ్స్‌ - ఓటీటీలోకి మరో 15 సినిమాలు! - This Week Release Movies

జనవరి టు మార్చ్​ ప్రోగ్రెస్ రిపోర్ట్​ - బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉందంటే? - Tollywood 2024 Box Office

Last Updated : Apr 1, 2024, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.