ETV Bharat / entertainment

ఆ హీరోయిన్​ నన్ను కొట్టింది - 30 గాయాలతో హాస్పిటల్​లో చేరా! : శ్రద్ధా దాస్​ - శ్రద్ధాదాస్​ మన్నారా చోప్రా

Shraddha Das Mannaa Chopra : తనకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారడంతో నటి శ్రద్ధాదాస్‌ స్పందించారు. తాను బాధకు గురైనట్లు తెలిపారు. ఆ వివరాలు.

ఆ హీరోయిన్​ నన్ను కొట్టింది - 30 గాయాలతో హాస్పిటల్​లో చేరా! : శ్రద్ధా దాస్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 5:02 PM IST

Shraddha Das Mannaa Chopra : ముంబయికి చెందిన హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యం అక్కర్లేదు. సిద్ధు ఫ్రమ్‌ సికాకుళం చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుమ్మ తెలుగులోనే కాకుండా మలయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. కానీ స్టార్ హీరోయిన్​గా ఎద‌గ‌లేక‌పోయినా త‌న‌కంటూ ఒక స్పెష‌ల్ ఇమేజ్​ను క్రియేట్ చేసుకుంది. అయితే బాలీవుడ్‌ నటి మన్నారా చోప్రాతో ఉన్న విభేదాలపై శ్రద్ధాదాస్​ స్పందించినట్లు నెట్టింట్లో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై శ్రద్ధా స్పష్టతనిచ్చింది. తాను ఏ విషయంపై మాట్లాడలేదని చెప్పింది.

"మన్నారా చోప్రా లేదా ఆమె ఫ్యామిలీకి సంబంధించి నేను ఎలాంటి విషయాన్ని చెప్పలేదు. ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదు. పీఆర్‌నూ కూడా నియమించలేదు. పబ్లిసిటీ కావాలనుకుంటే ఇన్‌స్టా లేదా ట్విటర్‌లో వీడియోను పోస్ట్‌ చేసేదాన్ని. సంయమనం పాటించాలనుకుంటున్నాను. నిజమే, నేను బాధకు గురయ్యాను. కానీ, వీటన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను" అని శ్రద్ధా పోస్ట్‌ పెట్టారు.

కాగా, 'సిద్ధు ఫ్రమ్‌ సికాకుళం'తో నటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్​ - 'జిద్‌'(2014) సినిమా కోసం మన్నారా చోప్రాతో కలిసి పని చేశారు. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్​లో మ‌న్నారా, శ్రద్ధా దాస్ మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగింద‌ని కథనాలు వచ్చాయి. ఆ వార్తల్లో - మూవీలో భాగంగా మన్నారా శ్రద్ధాను తోసే సన్నివేశం ఉందట. నెమ్మ‌దిగా నెట్టమని చెప్పినా కూడా మన్నారా వినకుండా గట్టిగా నెట్టడం, దాంతో మెట్లు తగిలి శ్రద్ధాకు గాయం తగలడం అయ్యిందట. అలాగే ఫైట్‌ షూట్‌లో డమ్మీ కర్రలతో కాకుండా నిజమైన కర్రలతో మన్నారా కొట్టిందని, ఛాతీపై బలంగా తన్నిందని శ్రద్ధా చెప్పినట్లు ఉంది. తనకు దాదాపు 30 గాయాలు అయ్యాయ‌ని, హాస్పటల్​లో చేరాల్సి వచ్చింద‌ని కూడా శ్రద్ధా చెప్పినట్లు అందులో రాసి ఉంది. దీంతో పాటే మన్నార కూడా స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదని కూడా చెప్పినట్లు, హీరోయిన్​ ప్రియాంకా చోప్రా (మన్నార కజిన్‌) కూడా దీనికి మద్దతు తెలిపినట్లు ఆ కథనాల్లో ఉంది.

అయితే ప్రస్తుతం మన్నార బిగ్‌బాస్‌ షోలో పాల్గొంది. ఈ క్రమంలోనే శ్రద్ధాదాస్‌ ఇలా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో శ్రద్ధా తానేమీ ఇలా చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది.

ఇకపై అలాంటి సీన్స్​కు ఓకే కానీ ఓ కండిషన్!​ : 'గుంటూరు కారం' మీనాక్షి

90's వెబ్​సిరీస్​ డైరెక్టర్​కు మూవీ ఆఫర్స్- ఆ స్టార్ హీరోతో సినిమా కన్ఫార్మ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.