Shahrukh Khan No Remuneration Movies : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఆయన కూడా ఒకరు. ఒక్కో సినిమాకు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ సుమారు రూ.150-250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని ట్రేడ్ వర్గాల మాట. షారుక్ క్రేజ్‌తో పాటు ఆయన సినిమాలకు కలెక్షన్ల కారణంగా అంతమొత్తాన్ని ఆయనకు ఇచ్చేందుకు సినీ నిర్మాతలు కూడా వెనుకాడరని టాక్. అయితే షారుక్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిన సినిమాలు 7 ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
హే రామ్
విలక్షణ నటుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించిన పీరియడికల్ డ్రామా 'హే రామ్'. ఇందులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో వివాదాల మధ్య 2000 ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు షారుక్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని కమల్ హాసన్ ఇండియన్-2 ట్రైలర్ లాంఛ్ సందర్భంగా తెలిపారు. షారుక్ మంచి నటుడని కమల్ కొనియాడారు.
బ్రహ్మాస్త్ర
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఇందులో మోహన్ బార్గవ్ అనే ఏరోనాటికల్ సైంటిస్ట్ పాత్రలో షారుక్ మెరిశారు. ఈ సినిమాకు కూడా షారుక్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు.
My Shah 💖 @iamsrk playing #Hanuman , inquiring soul that I am...I started devoring all info I can find on this Divine Being!
— Mina Zachariou 🇬🇷 (@mina_zachariou) August 11, 2022
So far... Fascinating!!!@BrahmastraFilmhttps://t.co/RVcyZvm0Xr pic.twitter.com/i08Ac9yqAs
యే దిల్ హై ముష్కిల్
షారుక్ ఖాన్ ఫ్రీగా నటించిన మరో సినిమా 'యే దిల్ హై ముష్కిల్' కూడా ఒకటి. కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఇందులో ఆయన క్యారెక్టర్‌కు మూవీ లవర్స్ బాగా కనెక్టయ్యారు.
భూత్నాథ్ రిటర్న్స్
నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'భూత్నాథ్ రిటర్న్స్'. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మించారు. ఇందులో షారుక్ అతిథి పాత్రలో నటించారు. ఈ మూవీకి కూడా షారుక్ పారితోషకం తీసుకోలేదు.
దుల్హా మిల్ గయా
రొమాంటిక్ కామెడీ మూవీగా 2010లో ప్రేక్షకుల ముందుకొచ్చింది 'దుల్హా మిల్ గయా'. ఈ సినిమాలో షారుక్ అతిథి పాత్రలో మెరిశారు. ఈ మూవీకి కూడా ఒక్క పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు.
క్రేజీ 4
జైదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ మూవీ 'క్రేజీ 4'. ఈ సినిమాను రాకేశ్ రోషన్ నిర్మించారు. ఇందులో షారుక్ ఓ పాటలో కనిపించారు. ఆ పాట బాగా ఫేమస్ అయ్యింది. కానీ షారుక్ ఈ సినిమాకు కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట.
రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ (హిందీ వెర్షన్)లో అతిథి పాత్రలో షారుక్ కనిపించారు. ఈ సినిమాకు కూడా కింగ్ ఖాన్ షారుక్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు.
షారుక్ సినిమాలో విలన్‌గా జూనియర్ అశ్వత్థామ - కన్ఫామ్ చేసిన అమితాబ్ - Sharukh Suhana Khan Movie