ETV Bharat / entertainment

సొంతింటి కల నేరవేర్చుకునేందుకు షారుక్ కష్టాలు - ఆ నిర్మాత దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకుని మరీ! - Shahrukh Khan First House - SHAHRUKH KHAN FIRST HOUSE

Shahrukh Khan First House : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ ఇల్లు అంటే ఫ్యాన్స్ అందరూ 'మన్నత్​' అని ఠక్కున చెప్పేస్తారు. కానీ 'మన్నత్​'కంటే ముందే ఆయనకో సొంత ఇళ్లు ఉండేదట. దాన్ని కొనుగోలు చేసేందుకు ఆయన చాలా కష్టాలు పడ్డారట. ఓ సినిమాకు అడ్వాన్స్ పేమెంట్ కావాలని అడిగి తీసుకున్నారట. ఆ విశేషాలు మీ కోసం.

Shahrukh Khan
Shahrukh Khan (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 5:11 PM IST

Shahrukh Khan First House : బాలీవుడ్ సెలబ్రిటీ ఇళ్ల గురించి టాపిక్ రాగానే మొదటగా గుర్తుకొచ్చేది షారుక్​ ఖాన్ ఇల్లు 'మన్నత్'. ముంబయిలో ల్యాండ్​మార్క్​గా మారిన ఈ ఇల్లును చూసి చాలా మంది సెలబ్రిటీలు తమ ఇళ్లను మరోసారి ప్రత్యేకంగా రీ డిజైన్ చేసుకున్నారట కూడా. అలాంటి ఇల్లు సొంతం చేసుకున్న షారూక్​కు అది మొదటి ఇల్లు కాదట.

ఆయన తన తొలి ఇంటిని కొనుగోలు చేయడాని కోసం 1995లో పని చేసిన ఒక సినిమా నిర్మాత నుంచి అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నారట. తన సహ నటుడు ముకేశ్ ఖన్నా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రేమ్ లల్వానీ అనే నిర్మాత నుంచి తీసుకున్న అడ్వాన్స్ పేమెంట్‌తో కలిపి సుమారు రూ. 35లక్షల వరకూ వెచ్చించి తన తొలి ఇల్లును కొనుగోలు చేశారట షారుక్​. ఈ విషయాన్ని షారుక్ కూడా పలు సందర్భాల్లో చెప్పారు కూడా.

ఆ తర్వాత బాంద్రాలో 'మన్నత్' కొనుగోలు చేశారు షారుక్​. ఆ ఇంటిని తన నివాస యోగ్యంగా మార్చుకోవడానికి నానాతంటాలు పడాల్సి వచ్చిందని చెప్తుంటారు షారుక్. వారి ఆర్థిక స్థోమతకు మించి వెచ్చించి ఇంటిని కొనుగోలు చేయడం వల్ల ఇంటిని రిపేర్ చేయడానికి, ఫర్నిషింగ్ చేయడానికి కూడా డబ్బులు లేకుండాపోయాయని అప్పట్లో వెల్లడించారు కూడా. చివరికి హౌజ్ డిజైనర్ కోసం కూడా తమ దగ్గర డబ్బులు లేకుండాపోవడం వల్ల ఆ బాధ్యతను గౌరీనే తీసుకున్నారట.

ఆ రోజుల నుంచి బాలీవుడ్‌లో సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న టాప్ హీరోగా ఎదిగారు షారుక్. ఆయనే కాదు ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా తండ్రికి తగ్గ కూతురిగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారట.

ఇక షారుక్ సినిమాల విషయానికొస్తే సుజయ్ ఘోష్ తెరకెక్కిస్తున్న 'కింగ్' సినిమాలో నటిస్తున్నారు షారుక్. ఇందులో సుహానా ఖాన్‌తో పాటు అభిషేక్ బచ్చన్, అభయ్ వర్మలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అండర్ వరల్డ్ కింగ్‌లా వ్యవహరించే పాత్రలో కనిపిస్తున్నారు షారుక్. థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కిస్తున్నామని సినిమా యూనిట్ చెబుతోంది.

మరోసారి షారుక్, సల్మాన్​ను బీట్ చేసిన ప్రభాస్​ - ఇండియా నెం.1 హీరోగా డార్లింగ్​​! - Most Popular Film Star Prabhas

'ప్రీతీ జింటా నిన్ను ప్రెగ్నెంట్​ చేస్తా!' - షారుక్ ఖాన్​ షాకింగ్ కామెంట్స్​ - Shahrukh khan Preity Zinta

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.