Rajamouli Maheshbabu SSMB 29 : దర్శక ధీరుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయనున్నట్లు అందరికీ తెలిసిందే. సినిమా ఓకే అయిందని మాత్రమే తెలిసింది కానీ, ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వడం లేదు మూవీ యూనిట్. ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి కథను సిద్ధం చేసినట్లు కన్ఫామ్ చేశారు. ఇక రాజమౌళి సెట్స్‌పైకి తీసుకెళ్లడమే మిగిలి ఉంది. అంతా ఓకే అయితే ఈ ఏడాదే షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారట.
ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లేనని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇందులో మహేశ్ బాబు తప్పించి మిగతా నటీనటులు ఎవరనేది ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. టాలీవుడ్ సినీ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్ ఆధారంగా మహేశ్ బర్త్ డే రోజున కీలక అప్‌డేట్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
గత చిత్రాల కన్నా భారీగా, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్న రాజమౌళి. అందుకు తగ్గట్టుగానే హై లెవల్ టెక్నికల్ టీమ్‌తో పని చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రపంచాన్ని చుట్టే ఓ సాహస ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందనే ఇప్పటివరకూ తెలిసిన విషయం.
నాజర్ మెలకువలు - ఈ సినిమా తర్వాత మనం కొత్త మహేశ్ చూడబోతున్నాం. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించి సినిమాల్లో అగ్రస్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న నాజర్ శిక్షణలో మహేశ్ మెలకువలు నేర్చుకుంటున్నారట. మహేశ్‌తో పాటు పలువురు నటీనటులకు ఈ శిక్షణ జరుగుతుందోట. గత సినిమాల్లో మహేశ్ వాడే డైలక్ట్, బాడీ లాంగ్వేజ్ విషయాల్లో కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారట. మహేశ్‌తో నాజర్ అతడు, పోకిరి, దూకుడు చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజమౌళి డైరక్షన్‌లోనూ బాహుబలి 1, 2 సినిమాల్లో నటించారు నాజర్. కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు రాజమౌళి. కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. జులై లేదా ఆగస్టు నుంచి ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ పనులు మొదలు పెట్టనున్నట్లు ఎం.ఎం.కీరవాణి ఇప్పటికే ప్రకటించారు.
పాప కావాలా? బాబు కావాలా? - రణ్వీర్ సమాధానమిదే - Deepika Padukone Baby