ETV Bharat / entertainment

సమంతకు మ్యారేజ్‌ ప్రపోజల్‌ - ఓకే చెప్పిన హీరోయిన్‌! - Samantha Marriage Proposal - SAMANTHA MARRIAGE PROPOSAL

Samantha Marriage Proposal : ప్రస్తుతం సోషల్ మీడియా అంతా సమంత, నాగచైతన్య, శోభితల పేర్లే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమంతకు ఓ నెటిజన్ మ్యారేజ్‌ ప్రపోజ్ చేయడం దానికి సమంత ఒకే చెప్పడం వైరల్‌గా మారింది! పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat
samantha (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 8:59 PM IST

Samantha Marriage Proposal : టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటారు. ట్రెండింగ్ విషయాలపై నెటిజన్లతో పరస్పరం చర్చలు జరుపుతూ ప్రేమగా ముచ్చటిస్తుంటారు. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా సమంత మాజీ భర్త నాగ చైతన్యకు ప్రముఖ నటి శోభితతో ఎంగేజ్మెంట్ జరగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తోంది. దీంతో సమంత కూడా మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే సమంతకు ఓ అభిమాని చేసిన ప్రపోజల్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

సమంత మీద తనకున్న ప్రేమను ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వెరైటీగా రీల్ రూపంలో చేసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. సామ్ బాధ పడాల్సిన అవసరం అస్సలు లేదనీ, తనకోసం ఎప్పుడూ ఉంటానంటూ చెప్పుకొచ్చాడు. సమంత అస్సలు బాధ పడాల్సిన అవసరం లేదనీ, తనకోసం నేను ఉన్నానంటూ ఓ పోస్టు పెట్టాడు. అందులో సమంతను ఓదార్చేందుకు అతను బ్యాగు సర్దుకుని బయల్దేరి ఫ్లైట్ ఎక్కి సమంత ఇంటికి వెళ్లినట్టుగా ఎడిట్ చేశాడు.

"చూడు నేనెప్పుడూ నీకు అందుబాటులో ఉంటాను. నువ్వు నేను మంచి జంట. నువ్వు ఓకే అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నాకు ఒక రెండు సంవత్సరాలు టైం ఇవ్వు. నేను డబ్బు సంపాదించి తిరిగి నీ దగ్గరికి వస్తాను. అప్పటి వరకూ నా గుర్తుగా ఈ హార్ట్‌ను బహుమతిగా నీ దగ్గర ఉంచుకో. ప్లీజ్ మ్యారీ మీ, ప్లీజ్ మ్యారీ మీ, ప్లీజ్ మ్యారీ మీ" అంటూ వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేశాడు సామ్ అభిమాని. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి సామ్ నెగిటివ్‌గా రియాక్ట్ అవ్వలేదు. "బ్యాక్ గ్రౌండ్‌లో జిమ్ ఉంది. నేను ఆల్మోస్ట్ కన్విన్స్ అయిపోయాను" అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ తిరుగుతోంది.

కాగా, కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉండి 2017లో అక్కినేని నాగచైతన్య, సమంత వివాహం చేసుకున్నారు. ఈ జంటను అంతా బెస్ట్ కపుల్‌గా ఫీల్ అవుతుంటారు. కానీ పరస్పరం భేదాల కారణంగా 2021లో వీరిద్దరూ విడిపోయారు. అనంతరం అనారోగ్యంతో ఇబ్బంది పడ్డ సమంత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉండి కోలుకున్న వెంటనే తిరిగి తన కొత్త సినిమాలను అనౌన్స్‌ చేస్తున్నారు.

కథ ముగిసిపోలేదు - తిరిగి పైకి లేస్తా! : సమంత

మిస్టీరియస్​ థ్రిల్లర్ 'తుంబాద్‌' డైరెక్టర్​తో సమంత కొత్త ప్రాజెక్ట్​​ - హీరో ఎవరంటే? - Samantha New Series

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.