ETV Bharat / entertainment

8 ఏళ్ల తర్వాత OTTలోకి రానా, సమంత మూవీ - స్ట్రీమింగ్ ఎక్కడంటే? - Samantha Rana Movie OTT

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 12:38 PM IST

Samantha Rana Movie OTT : ఎనిమిదేళ్ల క్రితం రానా, సమంత కలిసి నటించిన ఓ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజైంది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Rana Samantha (source ETV Bharat)

Samantha Rana Bangalore Days OTT Telugu : ఓటీటీలో ఎన్నో తెలుగు సినిమాలతో పాటు వివిధ భాషల్లో తెరకెక్కిన చిత్రాలు కూడా తెలుగులో డబ్ అయి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే తాజాగా ఎనిమిదేళ్ల క్రితం తమిళంలో రీమేక్ అయిన సినిమాను ఇప్పుడు తెలుగు భాషలోకి డబ్​ చేసి వదిలారు. ఆ సినిమా మరేదో కాదు బెంగళూరు డేస్. మరో విషయం ఏంటంటే ఇందులో రానా, సమంత కలిసి నటించడం విశేషం. వాస్తవానికి రానా, సమంత కలిసి ఓ సినిమాలో నటించరానే విషయం దాదాపుగా చాలా మందికి తెలీదు. వీరిద్దరి కలిసి నటించిన తొలి సినిమా ఇదే. తర్వాత మరే చిత్రంలోనూ కనిపించలేదు.

​2014లో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచింది బెంగళూరు డేస్. ఇందులో దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్, నజ్రియా, పార్వతి తిరువోతు, నివిన్ పౌలీ కలిసి నటించారు. ఈ చిత్రాన్నే 2016లో తమిళంలో రీమేక్ చేశారు. ఇందులో శ్రీదివ్య, బాబీ సింహా, లక్ష్మీ రాయ్, స్టార్ హీరోయిన్ సమంత, దగ్గుబాటి రానా, తమిళ హీరోఆర్య కలిసి నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ కూడా థియేటర్లలో విడుదల చేద్దామని అనుకున్నారు మేకర్స్. కానీ పలు కారణాల వల్ల కుదరలేదు. దీంతో అప్పటి నుంచి తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.

అయితే ఇప్పుడు ఎట్టకేలకు తెలుగులోకి విడుదల చేశారు. అది కూడా డైరెక్ట్​గా ఓటీటీలోకి. ఈ విషయాన్ని అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. బెంగళూరు డేస్ టైటిల్‌తోనే ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సబ్‌స్క్రిప్షన్ ఉంటేనే చూడగలం. ఒరిజినల్​ మలయాళ వెర్షన్ మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్​లో ఫ్రీగా అందుబాటులో ఉంది.

Samantha Citadel Webseries : ఇకపోతే ఆ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్​లో జోష్ నింపుతోంది. త్వరలోనే సిటాడెల్​ వెబ్​సిరీస్​తో ప్రేక్షకుల్ని పలకరించనుంది. రానా విషయానికొస్తే ఆయన రజనీ కాంత్ వెట్టాయన్ సినిమాలో నటిస్తున్నారు.

బాలీవుడ్‌పై రిషబ్‌ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు - ఏం అన్నారంటే? - Rishabh Shetty Controversy Comments

'కల్కి 2'లో భైరవకు తోడుగా దుల్కర్​, విజయ్ దేవరకొండ : నాగ్ అశ్విన్ సమాధానమిదే - NagAshwin on Kalki Part 2 Rumours

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.