Salaar Prithviraj Sukumaran AaduJeevitham Trailer : ఆడుజీవితం - ది గోట్ లైఫ్ సినిమాపై అభిమానుల్లో మంచి ఆసక్తే నెలకొంది. మలయాళ స్టార్ హీరో, ప్రభాస్ సలార్ దోస్త్ పృథ్విరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. దర్శకుడు బ్లెస్సీ దీన్ని తెరకెక్కించారు. సుమారు 10 ఏళ్ల పాటు ఈ సినిమా కోసమే తమ సమయాన్ని అంకితం చేశారు. సర్వైవల్ థ్రిల్లర్‌గా ఇది రాబోతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
లోపలి నుంచి ఎవరూ బయటికి వెళ్లడానికి వీల్లేదు అనే ఒక్క డైలాగ్ మాత్రమే ట్రైలర్‌లో వినిపిస్తోంది. ఎడారి నుంచి తప్పించుకొని సొంత గూటికి చేరుకునేందుకు బతుకు పోరాటం చేసే కుర్రాడి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించారు. ఆయన పలికించిన హావాభావాలు, లుక్స్ మతిపోయేలా చేశాయి. జీపు అద్దంలో నెరిసిపోయిన తన గడ్డాన్ని చూస్తూ పృథ్వీరాజ్ భయపడిన సీన్ అయితే ట్రైలర్‌కే హైలైట్ అని చెప్పాలి. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే మరో అవార్డ్ విన్నింగ్ సినిమా రాబోతుందనే అర్థమవుతోంది.
అసలీ సినిమా కథేంటంటే కేరళకు సంబంధించిన ఓ కుర్రాడు(హీరో పృథ్వీరాజ్) జీవనోపాధి కోసం కోసం సౌదీ అరేబియాకు వెళ్తాడు. కానీ అక్కడి వారు తనను ఒక బానిసగా ఎంతో హీనంగా చూస్తూ, ఇబ్బందులకు గురి చేస్తుంటారు. దీంతో అక్కడి నుంచి అతడు తిరిగి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకొని నడక ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురైయ్యాయి, వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు, చివరకు భారత్‌కు చేరుకున్నాడా? లేదా? అన్నదే సినిమా కథ.
వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం - కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంది. పూర్తిస్థాయిలో ఎడారిలో తీసిన తొలి ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ సినిమాలో నటించారు. అమలాపాల్ హీరోయిన్గా నటించింది. అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే కూడా చిత్రంలో యాక్ట్ చేశారు. మార్చి 28న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ వారం టాప్ 10 సిరీస్ ఇవే - వేరే లెవెల్ థ్రిల్ పక్కా!
ఉమెన్స్ డే స్పెషల్ : 'స్త్రీ'నిమా లోకం - తొలితరం మహిళా దర్శకురాలు ఎవరో తెలుసా?