ETV Bharat / entertainment

శ్రియా రెడ్డి పోషిస్తున్న పాత్రను ఆమె చేయాల్సిందట! - OG Movie - OG MOVIE

Actress Tabu OG Movie: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ సినిమాలో నటిస్తున్న శ్రియా రెడ్డి తన పాత్ర గురించి వివరించారు. అసలీ పాత్ర సీనియర్ నటి టబు కోసం దర్శకుడు రాసుకున్నారట. పూర్తి వివరాలు స్టోరీలో.

Sriya Reddy OG Movie
Pawankalyan Tabu (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 2:55 PM IST

Sriya Reddy OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న 'ఓజీ' (Original Gangstar) సినిమాలో శ్రియా రెడ్డి నటించనున్నట్లు తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రియా రెడ్డి ఇండైరెక్ట్​గా ఓజీ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమాలో ముందుగా సీనియర్ హీరోయిన్ టబు కోసం రాసిన పాత్రకు తనను ఓకే చేశారని వెల్లడించారు. ఇందులో తన పాత్ర 'సలార్‌' రాధా రామ పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారామె. అలాగే తన పాత్ర భావోద్వేగంతో కూడినదని, కచ్చితంగా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళుతుందని వెల్లడించారు.

Actress Tabu OG Movie : 'ఒక తెలుగు సినిమాలో టబు కోసం రాసిన పాత్రలో నేను నటిస్తున్నాను. స్క్రిప్ట్ రాసేటప్పుడు తనను ఊహించుకుని రాసిన పాత్రలో నేను కనిపించనున్నాను. ఆ సినిమా ఏది అనేది ప్రస్తుతం చెప్పలేను. నిర్మాతలు టబుకు బదులుగా మిమ్మల్ని తీసుకుంటున్నామని ఇన్ఫార్మ్ చేశారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. వాస్తవానికి ఇది నేను సాధించిన పెద్ద విజయం' అంటూ శ్రియా రెడ్డి మనసులో మాట బయటపెట్టారు. కానీ, అది ఏ సినిమానో క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ప్రస్తుతం శ్రియా రెడ్డి తెలుగులో చేస్తున్న ఏకైక సినిమా ఓజీ మాత్రమే. దీంతో ఆ చిత్రంలోనే టబును అనుకొని ఉంటారని తెలుస్తోంది. శ్రియారెడ్డి ఇంకా 'తలమై సెయలగం' అనే తమిళ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు.

OG Movie Cast and Crew : కాగా, చాలా కాలం గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ ఫుల్ మాస్ రోల్‌లో కనిపిస్తున్న సినిమా కావడం వల్ల ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరక్ట్ చేస్తుండటం ఇంకొక విశేషం. ఎస్ఎస్ తమన్ సినిమాకు సంగీతం అందిస్తుండగా, డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'మాటిస్తున్నా - ఇద్దరిలో ఒక తలకాయే మిగులుతుంది' - Pawankalyan TheyCallHim OG

'ఓజీ' రిలీజ్ డేట్​ ఫిక్స్​ - హంగ్రీ చీతా ఆ రోజే రానున్నాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.