ETV Bharat / entertainment

'అందుకే గ్లామరస్ పాత్రలకు దూరం- ఆ ఒక్క వీడియోనే కారణం!'

ఒక్క వీడియో వల్ల కెరీర్​లో బోల్డ్ పాత్రలకు సాయి పల్లవి దూరం- ప్రేమమ్​ సినిమాకు కాడా ఒప్పుకోలేదట!

SAI PALLAVI CAREER
SAI PALLAVI CAREER (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2024, 8:11 PM IST

Sai Pallavi Amaran : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి మనసుని హత్తుకునే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా ఆమె నటించిన 'అమరన్‌' చిత్రంలోనూ అలాంటి పాత్రతోనే మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయి పల్లవి ఆమె కెరీర్​ గురించి మాట్లాడారు. గ్లామరస్ పాత్రలు చేయకపోవడంపై కూడా స్పందించారు. జీవితంలో జరిగిన ఓ సంఘటన తర్వాతే అలాంటి పాత్రలు చేయకూడదనే నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

'ఇండస్ట్రీలోకి సినిమాల్లోకి రాకముందు మెడిసిన్ కోసం జార్జియా వెళ్లాను. అక్కడ టాంగో డ్యాన్స్‌ నేర్చుకున్నా. ఆ డ్యాన్స్‌ కోసం స్పెషల్ కాస్ట్యూమ్‌ ఉంటుంది. అయితే సౌకర్యంగా ఫీలయ్యాకే ఆ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నా. కొంతకాలానికి 'ప్రేమమ్‌'లో అవకాశం రావడం వల్ల సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాను. ఆ సినిమా రిలీజ్ అయ్యాక టాంగో డ్యాన్స్‌ వీడియోను కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దానికి నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. ఆ కామెంట్స్​ నన్ను చాలా బాధపెట్టాయి. అందుకే సినిమాల్లో శరీరం కనిపించేలా దుస్తులు ధరించకూడదని అప్పుడే డిసైడ్ అయ్యా. ఇక క్రమంగా అది ఒక కండిషన్​లాగా మారిపోయింది. దానివల్ల సినిమా అవకాశాలు తగ్గాయా? అంటే చెప్పలేను. కానీ, నా యాక్టింగ్‌ స్కిల్స్‌పై నమ్మకం ఉంచి వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటున్నా. నాకు నచ్చిన పాత్రలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నా' అని సాయిపల్లవి చెప్పారు.

ప్రేమమ్​ కూడా నో
బ్లాక్​బస్టర్ సినిమా 'ప్రేమమ్​'లోనూ ఛాన్స్ వచ్చినప్పుడు సాయి పల్లవి ఒప్పుకోలేదట. అయితే ఆ సినిమా డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రేన్ ఆమె సినిమా చేయాల్సిందేనని పట్టు పట్టారట. దీంతో సాయి పల్లవి 'ప్రేమమ్​'లో నటించడానికి అంగీకరించారట. 2015లో రిలీజైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. నివీన్ పౌలీ ఈ సినిమాలో హీరోగా నటించగా, సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ కీలక పాత్రలు పోషించారు.

కాగా, శివ కార్తికేయన్‌ లీడ్​ రోల్​లో అమరన్ తెరకెక్కింది. డైరెక్టర్ రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు. ఆర్మీ అధికారి మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథను ఆధారంగా చేసుకుని పెరియసామి ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాను కమల్​ హాసన్‌ నిర్మించారు.

సాయి పల్లవి అలా పిలిచినందుకు ఫీలయ్యా : శివకార్తికేయన్‌

ఆ పాత్ర కోసం ఆయన భార్యను కలిశాను : 'అమరన్‌' సాయి పల్లవి - Amaran Saipallavi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.