ETV Bharat / entertainment

అనుకున్నట్లే అంతా- ఆ డైరెక్టర్​తో చెర్రీ నెక్స్ట్ మూవీ- హోలీ స్పెషల్ బాసూ! - RC 17 Announcement - RC 17 ANNOUNCEMENT

RC 17 Announcement : హోలీ పండుగ వేళ గ్లోబల్​స్టార్ రామ్ చరణ్​ తన ఫ్యాన్స్​ను ఓ సాలిడ్ అనౌన్స్​మెంట్​తో సర్​ప్రైజ్ చేశారు. ఆర్సీ 17 డైరెక్టర్ ఎవరో రివీల్ చేశారు.

RC 17 Announcement
RC 17 Announcement
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 4:04 PM IST

Updated : Mar 25, 2024, 10:08 PM IST

RC 17 Announcement : గ్లోబల్​స్టార్ రామ్ చరణ్​ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఆయన వరసు సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇటీవలే ​ఆయన బుచ్చిబాబు సనాతో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన షూట్​ కూడా త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు చెర్రీ మరో సర్​ప్రైజ్​తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎప్పటి నుంచి చక్కర్లు కొడుతున్న రూమర్స్​ను నిజం చేస్తూ ఓ సాలిడ్ అనౌన్స్​మెంట్ ఇచ్చారు.

ఆయనకు రంగస్థలం లాంటి సెన్సషనల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్​తో మరోసారి కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. హోలీ సందర్భంగా ఫ్యాన్స్​కు విష్ చేస్తూనే ఈ విషయాన్ని తెలిపారు. రెండు ఫొటోలను రిలీజ్ చేయగా, అందులో చెర్రీ సుక్కూ హోలీ ఆడుతూ కనిపించారు. ఇక మరో ఫోటోలో RC 17 అనౌన్స్​మెంట్ ఉంది. "గొప్ప పని కోసం శక్తిమంతమైన శక్తులు మళ్లీ కలుస్తున్నాయి" అంటూ గుర్రం బొమ్మ ఉన్న ఓ పోస్టర్‌ను షేర్‌ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమను మరింత కలర్‌ఫుల్‌ చేసేందుకు RC17 రానుందంటూ తెలిపారు.

ఇది చూసిన మెగా అభిమానులు ఆనందంలో గెంతులేస్తున్నారు. చెర్రీ లైనప్​ చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఈ చిత్రంతో పాటు రామ్​ చరణ్​ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్​ యాక్షన్ మూవీ 'గేమ్ ఛేంజర్'​లో నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. సెప్టెంబర్ అని అంటున్నారు. ఈ చిత్రంలో రామ్​చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్న దేవర సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనుంది. కొరటాల శివ డైరెక్షన్​లో తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్​లో రిలీజ్ కానుంది.

'చెర్రీ సో కేరింగ్​' - ఫ్లైట్​లో భార్య కాళ్లు నొక్కుతున్న రామ్​ చరణ్​

RC 16కి ముహూర్తం ఫిక్స్​ - ఆ స్టార్ హీరో టైటిల్​తో సినిమా!

Last Updated : Mar 25, 2024, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.