Raviteja Prashanth Varma Movie: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా- ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన 'హనుమాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జనవరి 12న రిలీజైన ఈ సినిమా 15 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్ల వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ శనివారం (జనవరి 27) హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
అయితే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) ప్లాన్ చేసుకున్నట్లు ఇదివరకే చెప్పారు. సూపర్ హీరోలకు సంబంధించి తను 10కి పైగా సినిమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాటిక్ యూనివర్స్‌లోని తొలి ప్రయత్నమే హనుమాన్. ఈ సినిమాలో కోటి (కోతి పాత్ర పేరు) పాత్రకు మాస్ మహారాజ రవితేజ వాయిస్ ఇచ్చారు. అయితే సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రవితేజ ఒప్పుకుంటే ఆయనతో సినిమా చేయాలనుందని ప్రశాంత్ ఈ ఈవెంట్లో అన్నారు.
'కోటి పాత్రకు వాయిస్ ఇవ్వడానికి రవితేజ ఎప్పుడో ఒప్పుకున్నారు. హనుమాన్ సినిమాలో భాగమైనందుకు రవితేజ గారికి థాంక్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా సపోర్ట్ చేసేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక మా సినిమాటిక్ యూనివర్స్‌లో కోటి పాత్రను ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుందని ఓ ఐడియా వచ్చింది. రవితేజ గారు ఒప్పుకుంటే కోటి క్యారెక్టర్‌తో సినిమా చేయాలని అనుకుంటన్నా' అని ప్రశాంత్ అన్నారు. దీంతో మాస్ మహారాజ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ కాంబో ఎప్పుడు ఓకే అవుతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
-
"I've an idea, if #Raviteja Garu accepts it, there'll be a Film with Raviteja garu in this cinematic universe" - #PrasanthVarma#Hanuman pic.twitter.com/LDETHom8ON
— Daily Culture (@DailyCultureYT) January 27, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">"I've an idea, if #Raviteja Garu accepts it, there'll be a Film with Raviteja garu in this cinematic universe" - #PrasanthVarma#Hanuman pic.twitter.com/LDETHom8ON
— Daily Culture (@DailyCultureYT) January 27, 2024"I've an idea, if #Raviteja Garu accepts it, there'll be a Film with Raviteja garu in this cinematic universe" - #PrasanthVarma#Hanuman pic.twitter.com/LDETHom8ON
— Daily Culture (@DailyCultureYT) January 27, 2024
Hanuman Movie Hindi Collection:ఈ సినిమా అటు హిందీలోనూ సూపర్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే హిందీలో హనుమాన్ రూ.40+ కోట్లు వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక లాంగ్ రన్లో ఈ మూవీ మరో రూ.10కోట్లు దాటవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అటు నార్త్ ఇండియాలో రూ. 2.35+ కోట్లు వసూల్ చేసినట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">