Raviteja Eagle Movie : మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో టి.జి.విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని సినిమా విశేషాలతో పాటు తమ బ్యానర్లో రాబోయే చిత్రాల వివరాలను తెలియజేశారు.ఈగల్ సినిమా క్లాసిక్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెప్పిన ఆయన - సినిమా కంటెంట్ అద్భుతంగా ఉంటుందని అన్నారు.
ఆ నమ్మకం ఉంది : "గత ఏడాదిలోనే మా 'ఈగల్' చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించాం. కానీ అవ్వలేదు. దీంతో సంక్రాంతికి అని అనుకున్నాం. దాదాపు 250 థియేటర్లతో అగ్రీమెంట్ కూడా చేసుకున్నాం. వాటితో పాటు మరో వంద థియేటర్లను ఖరారు చేసే పనిలో ఉన్నాం. అయితే చలన చిత్ర వాణిజ్య మండలి అభ్యర్థన మేరకు హీరో రవితేజతో పాటు, మా టీమ్ అంతా కలిసి పోస్ట్ పోన్ చేయాలని డిసైడ్ అయ్యాం. 'ఈగల్' మంచి ఓపెనింగ్స్‌ను అందుకుంటుందనే నమ్మకం నాకు ఉంది. ప్రమోషన్స్‌ను బాగానే దీటుగానే చేస్తున్నాం". అని విశ్వప్రసాద్ అన్నారు.
మొత్తం 40 సినిమాలు : "మేం నిర్మించిన సినిమాలు ఈ ఏడాది మొత్తం 15 రిలీజ్ కానున్నాయి. అందులో ఒకట్రెండు ఓటీటీ ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. కనీసం నెలకొక సినిమానైనా రిలీజ్ చేస్తాం. అయితే ఓటీటీ వేదికను ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఆలోచన లేదు. ఓటీటీ కోసం ఎక్కువ నిర్మాణాలు చేస్తున్నాం. ఈటీవీ విన్‌తో కలిసి పలు చిత్రాల్ని నిర్మిస్తున్నాం. దాదాపు 40 సినిమాలు ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉన్నాయి. వేగంగా వంద సినిమాలు చేయడంపైనే మా ఫోకస్ అంతా ఉంది. నిర్మాణంలో వృథాని అరికట్టడంపై దృష్టి పెట్టి కట్టుదిట్టమైన జాగ్రత్తల్ని తీసుకుంటున్నాం." అని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. సెట్స్‌పై ఉన్న పవన్‌కల్యాణ్ చిత్రాల్ని తామేమి సొంతం చేసుకోలేదని స్పష్టం చేశారు. ప్రభాస్ - మారుతి 'రాజా సాబ్' వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందని అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హనుమాన్ : ఒక్క రుధిరమణి కోసం వంద మణులు - అంజనాద్రి ఆర్ట్ వర్క్ విశేషాలివీ!
5 ఏళ్లుగా సినిమాలకు దూరం, అయినా వందల కోట్ల ఆదాయం - ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే ?