ETV Bharat / entertainment

రష్మిక వీకెండ్ ప్లాన్​ - దాదాపుగా ఇదే చేస్తుందట! - Rashmika Weekend Plan - RASHMIKA WEEKEND PLAN

Rashmika Weekend Plan : నటీనటులు తమ పర్సనల్ లైఫ్​కు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కోలా లీడ్ చేస్తుంటారు. షూటింగ్​ టైమ్​లో బ్రేక్ దొరికితే కొందరు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తే మరికొందరు ఫ్రెండ్స్​తో జాలీగా గడుపుతారు. ఇంకొందరూ సండే రోజున షూటింగ్‌లకు హాలీడే ఇచ్చి మరీ స్పెషల్ ప్లాన్స్ చేసుకుంటుంటారు. పార్టీలు, పబ్​లకు వెళ్తుంటారు. మరి నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏం చేస్తుందో తెలుసా? దాని గురించే కథనం.

రష్మిక వీకెండ్ ప్లాన్​ - దాదాపుగా ఇదే చేస్తుందట!

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 8:15 AM IST

Rashmika Weekend Plan : నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెండ్​ హీరోయిన్. ఆమె ఏం చేసినా, మాట్లాడినా అది సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తుంటుంది. ఎందుకంటే ఈ భామ క్రేజ్ అలాంటిది. ఇప్పటికే తన క్యూట్ అండ్ స్మైల్ యాక్టింగ్​తో చాలా మంది కుర్రాళ్ల మదిని కట్టిపడేసింది. బోల్డ్​ ఫొటోషూట్స్​తోనూ మెస్మరైజ్ చేస్తుంటుంది. ఈ మధ్య సినిమాల్లోనూ కాస్త గట్టిగానే బోల్డ్ యాక్టింగ్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

నాగశౌర్య ఛలో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గీతా గోవిందంతో మస్త్ పాపులారిటినీ సంపాదించుకుంది. ఇక దేవదాస్​, డియర్ కామ్రేడ్​, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ వంటి సినిమాలు చేసి స్టార్ స్టేటస్ అందుకుంది. అనంతరం పుష్పతో నేషనల్​ క్రష్​గా మారిపోయింది. బాలీవుడ్​లోనూ మిషన్ మజ్ను, గుడ్​ బై,​ యానిమల్ చిత్రాలతో తనదైన ముద్ర వేసేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. యానిమల్ చిత్రంలో గీతాంజలిగా నటించి విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ మూవీ భారీ​ బ్లాక్ బస్టర్​ హిట్​ అయింది.

అయితే ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంటున్న రష్మిక వీకెండ్​లో ఏం చేస్తుందో తెలిసింది. ఇంత బిజీ షెడ్యూల్​లోనూ వీకెండ్​లో ఫ్యామిలీ కోసం కాస్త టైమ్ కేటాయిస్తారట. అంతకన్నా ఎక్కువగా ఫ్రెండ్స్​తో గడుపుతారట. అదే తనకు చాలా ఇష్టమని తెలిసింది. ఇకపోతే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్​తో కలిసి పుష్ప 2లో నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ సినిమా

గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఇప్పటికే మొదటి భాగంలో తన లుక్స్​, యాక్టింగ్స్​తో ఆకట్టుకుంది రష్మిక. దీంతో పాటు రెయిన్‌బో, ది గర్ల్‌ఫ్రెండ్‌ చిత్రాల్లోనూ నటిస్తోంది. ది గర్ల్​ప్రెండ్ చిత్రం నుంచి టీజర్ ఏప్రిల్ 5న రష్మిక పుట్టిినరోజు సందర్భంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెలిపారు.

జనవరి టు మార్చ్​ ప్రోగ్రెస్ రిపోర్ట్​ - బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉందంటే? - Tollywood 2024 Box Office

'తనే నా ఆరాధ్య దేవత' - సీక్రెట్ ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ! - Family Star Vijay Devarkonda

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.