Rashmika Vijay Pink Cap : టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ బెస్ట్ కపుల్‌గా పేరున్న వారిలో విజయ్-రష్మిక జంట ఒకరు. 2018లో వచ్చిన 'గీతా గోవిందం' సినిమాలో వీరిద్దరి నటన, కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో లవ్‌ట్రాక్ నడుస్తుందన్న వార్తలు జోరందుకున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా కూడా ఇదే కావడం, అప్పుడప్పుడు వీరు విడివిడిగా ఎక్కడికి వెళ్లినా దానికి సంబంధించిన కామన్ ఫొటోలను తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేయడం వీరి ప్రేమకథకు మరింత బలాన్ని చేకూర్చేవి.
'ఎన్ని గాసిప్స్ వచ్చినా జానతా నహీ'
అయితే అలా వీరు పోస్ట్ చేసిన వాటిల్లో ఏదో ఒక కామన్ పాయింట్‌ను ట్రిగ్గర్ చేస్తూ దానిని తెగ వైరల్ చేసేస్తారు నెటిజెన్స్. అలా ఇప్పటివరకు చాలానే పోస్టులు పెట్టారు. ఇందులో ఒకటి కొద్దిరోజుల క్రితం వీరు గోవాకు విడివిడిగా వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. అలా వీరు పంచుకున్న ఫొటోల్లో కామన్ థింగ్‌ను పసిగట్టి వీరి మధ్య ఏదో ప్రేమ వ్యవహారం నడుస్తుంది చూడండి అంటూ వార్తలు వచ్చేవి. అంతేకాకుండా ఒక సందర్భంలో ఇద్దరూ ఒకే తరహా షర్ట్‌ను వేసుకొని వార్తల్లో నిలిచారు. దీనినీ హైలైట్ చేశారు కొందరు. ఇలా ఎన్ని రకాల గాసిప్స్ వచ్చినా అటు విజయ్ ఇటు రష్మిక వీటిపై ఇప్పటివరకు పెద్దగా స్పందించలేదు. తమ సినిమాలు తాము చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.
బేబీ పింక్ క్యాప్‌లో విజయ్-రష్మికా జోడీ
ఇదిలాఉంటే కొద్దిరోజుల కిందట విజయ్ దేవరకొండ తన బ్రాండ్ రౌడీ వేర్‌ను ప్రమోట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. దీనిని తన ఇన్‌స్టాలో పంచుకున్నారు కూడా. అందులో అతను ఒక బేబీ పింక్ కలర్లో ఉండే క్యాప్‌ను పెట్టుకొని కనిపించారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా రష్మిక ఈనెల 8న ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో మహిళలకు ఉమెన్స్ డే విషెస్ తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో తానూ అంతకుముందు విజయ్ పెట్టుకొని కనిపించిన పింక్ క్యాప్‌నే ధరించి కనిపించారు. దీంతో ఇద్దరు సేమ్ టు సేమ్ క్యాప్ పెట్టుకున్నారేంటబ్బా అన్న చర్చ మొదలైంది. దీంతో వీరి లవ్‌ట్రాక్ అంశం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇక వీరిద్దరి కలయికలో 'గీతా గోవిందం' తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమా వచ్చినా అది కమర్షియల్‌గా పెద్దగా హిట్ కాలేదు. అయినప్పటికీ ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. దీంతో వీరి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. రష్మిక పుష్ప-2తోపాటు పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.
సినీ ఇండస్ట్రీలో విషాదం- డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత
రీల్ కపుల్ టు రియల్ కపుల్- కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!