ETV Bharat / entertainment

'ప్రతి పనిలో అతని సహకారం, సలహాలను తీసుకుంటా'- రష్మిక కీలక వ్యాఖ్యలు

Rashmika Mandanna Interview : యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటి రష్మిక మందన్న. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో విజయ్ దేవరకొండ, రణ్​బీర్ కపూర్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 8:02 AM IST

Rashmika Mandanna Interview : అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న. 'యానిమల్‌' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించారు ఈ కథానాయిక. కాగా ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, విజయ్‌ దేవరకొండ గురించి పలు విషయాలు పంచుకున్నారు. అవేంటంటే?

'అమితాబ్‌ సర్‌ వయసులో వ్యత్యాసం చూడకుండా అందరినీ ఒకేలా గౌరవిస్తారు. జీవితంలో ఏదైనా చేయగలననే నమ్మకాన్ని రణ్‌బీర్‌ ఇచ్చారు' అని రష్మిక చెప్పారు. 'నేను చేసే ప్రతి పనిలో తన సహకారం ఎప్పుడూ ఉంటుంది. అతని సలహా తీసుకుంటా. అది నాకు అవసరం. ఏది మంచో, ఏది చెడో వివరిస్తారు. అలా చెప్పడం బాగుంటుంది. వ్యక్తిగతంగా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్‌ చేశారు' అని విజయ్‌ దేవరకొండ గురించి చెప్పుకొచ్చారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగనుందని కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి. హీరో విజయ్‌ దేవరకొండ వాటిని ఖండించారు. 'ఫిబ్రవరిలో నిశ్చితార్థం, పెళ్లి జరగడం లేదు. ప్రతీ రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లున్నాయి. వాళ్లు నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఏటా ఇలాంటి రూమర్‌ వింటూనే ఉన్నాను' అని అన్నారు. విజయ్‌-రష్మిక గతంలో రెండు సినిమాల్లో (గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌) కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విహార యాత్రలకు, పార్టీలకు వెళ్లడం వల్ల వీళ్లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో చెప్పారు.

లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో విక్కీ కౌశల్‌తో కలిసి రష్మిక నటించిన 'ఛావా' షూటింగ్ పూర్తయ్యింది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవితాధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు, అల్లు అర్జున్‌ సరసన 'పుష్ప 2'లో నటిస్తున్నారు రష్మిక. 'రెయిన్‌ బో', 'ది గర్ల్‌ఫ్రెండ్‌' చిత్రాలతోనూ అలరించనున్నారు. ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్‌'లో నటిస్తున్న విజయ్‌ అది పూర్తైన తర్వాత గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నటించనున్నారు.

తండ్రి కానున్న నిఖిల్​ - భార్య సీమంతంలో యంగ్ హీరో సందడి

పెళ్లిపై 'యానిమల్' బ్యూటీ క్లారిటీ - 'అతడిలో ఆ ఒక్క క్వాలిటీ కచ్చితంగా ఉండాలి'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.