ETV Bharat / entertainment

'కుబేర' షూట్ డైరీస్ - 100 కేజీల బరువు ఎత్తిన రష్మిక - Rashmika Deadlifts - RASHMIKA DEADLIFTS

Rashmika Mandanna Kubera Movie : స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం కుబేరా షూట్​లో బిజీగా ఉంది. అయితే తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసి నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ విశేషాలు మీ కోసం.

Rashmika Mandanna Kubera Movie
Rashmika Mandanna Kubera Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 12:45 PM IST

Updated : Apr 30, 2024, 12:54 PM IST

Rashmika Mandanna Kubera Movie : నేషనల్ క్రష రష్మికకు ఉన్న ఫ్యాన్​ బేస్ అంతా ఇంతా కాదు. తన సినిమాలకు ఎంత అయితే క్రేజ్ ఉందో ఆమె పెట్టే సోషల్ మీడియా పోస్ట్​లకు కూడా అంతకుమించి రీచ్ ఉంది. మూవీ అప్డేట్స్, వర్కౌట్స్ వీడియోస్, ఫ్యామిలీ ఫోటోస్ ఇలా అన్నింటినీ రష్మిక తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా కూడా ఓ పోస్ట్ షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అందులో తాను వెయిట్​ లిఫ్టింగ్ చేస్తూ కనిపించింది. ఆ వీడియోకు ఓ పెద్ద క్యాప్షన్ జోడించింది. అందులో ఆమె బీస్ట్​ మోడ్​లో వర్కౌట్స్​ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

గత కొన్ని రోజులుగా నైట్ షూట్స్​ ఎక్కువ చేస్తున్నాను. అందుకే ఎక్కడ ప్రారంభించాలో అర్థం కావట్లేదు. పొద్దున్న 8 గంటలకు రూమ్​కు వచ్చాను. బ్రేక్​ఫాస్ట్ ముగించుకుని కూర్చున్నాక అస్సలు నిద్రపట్టలేదు. అందుకే ఓ బుక్​ చదివి ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అలా పడుకున్నాను. ఇక ఈవెనింగ్ 6కి అలా లేచాను. కొంచం కార్డియో ఎక్సర్​సైజ్​లు చేద్దామని అనుకున్నాను. కానీ స్నాక్స్ తిన్నాను. ఇక రాత్రి ఒంటిగంటకు వర్కౌట్స్ చేసేందుకు వెళ్లాను. అక్కడ 100 కేజీ డెడ్​ లిఫ్ట్స్​ చేశాను. దీంతో పాటు మరికొన్ని చిన్నపాటి వర్కౌట్స్​ చేశాను. నాకు నేనే పవర్​ఫుల్​గా అనిపించాను. ఇక వర్కౌట్స్ ముగించుకుని రిలాక్స్​డ్​గా ఓ సినిమా చూశాను. మళ్లీ షూట్ మొదలైంది. ధనుశ్​తో పాటు కుబేర మూవీ టీమ్​తో పని చేయడం నాకు ఎంతో నచ్చింది." అంటూ రాసుకొచ్చింది.

ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ రష్మిక డెడికేషన్​కు హ్యాట్సాఫ్​ చెప్తున్నారు. వర్క్​లోనూ వర్కౌట్స్ మర్చిపోలేదంటూ కితాబులిస్తున్నారు. మరికొందరేమో రష్మికను ఇన్​స్పిరేషన్​గా తీసుకుని తామూ ఇకపై వర్కౌట్స్ స్టార్ట్​ చేస్తామంటూ నెట్టింట వీడియో షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే రష్మిక కుబేర సెట్స్​లో సందడి చేస్తున్నట్లు సోషల్ మీడియో పలు ఫోటోలు చక్కర్లు కొట్టాయి. ధనుశ్ కూడా ఆమెతో షూట్​లో పాల్గొన్నారు. వీరిపై కీలక సీస్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్​డేట్​ను మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేశారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుందో ?

'నాకంటే ట్యాలెంటడ్ వాళ్లు ఉన్నారు- అవకాశాలు కొందరికే దక్కుతాయి' - Rashmika Mandanna Latest Interview

శ్రీవల్లి చానా రిచ్ అయిపోయింది​ - పుష్ప 2 రష్మిక బర్త్​ డే ట్రీట్ పోస్టర్​ రిలీజ్ - Pushpa 2 Rashmika

Last Updated : Apr 30, 2024, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.