ETV Bharat / entertainment

రష్మికను అలా పిలిచిన ఆనంద్ దేవరకొండ - హ్యాపీగా ఫీలవుతున్న ఫ్యాన్స్​! - Rashmika Mandanna Anand Devarakonda

Rashmika Mandanna Anand Devarakonda : రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్​గా మారారు. అందుకు కారణం విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఏం జరిగిందో తెలుసుకుందాం.

రష్మికను అలా పిలిచిన ఆనంద్ దేవరకొండ -
రష్మికను అలా పిలిచిన ఆనంద్ దేవరకొండ -
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 6:46 AM IST

Rashmika Mandanna Anand Devarakonda : రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ ఈ రెండు పేర్లు ఎప్పుడూ ట్రెండింగ్​లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య సమ్​థింగ్ సమ్​థింగ్​ ఏదో ఉందని, డేటింగ్ చేస్తున్నారని, ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. అందుకు కారణం వీరిద్దరు కలిసి సీక్రెట్​ ట్రిప్స్​కు వెళ్లడం!, కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకోవడం, ఒకరిపై మరొకరు సోషల్ మీడియాలో పోస్ట్​లు చేసుకోవడం. ఇవన్నీ చూసిన నెటిజన్లు, అభిమానులు రష్మిక - విజయ్ దేవరకొండను అన్నా- వదిన అంటూ వారిని ట్రెండ్ చేస్తుంటారు.

అయితే తాజాగా మరోసారి రష్మిక – విజయ్ దేవరకొండను ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. అయితే ఈ సారి అందుకు కారణం విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. తాజాగా ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు జరుపుకున్నాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే రష్మిక కూడా తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో ఆనంద్ దేవరకొండ ఫోటో షేర్ చేసి విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్ డే ఆనందా అంటూ రాసుకొచ్చింది.

దీనికి ఆనంద్ దేవరకొండ థ్యాంకూ అంటూ బదులిచ్చాడు. అలానే రష్మికను ముద్దుగా రుషి అని పిలిచాడు. ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టావు అని సరదాగా అన్నాడు. దీనికి రష్మిక కూడా మళ్ళీ రిప్లై ఇచ్చింది. అందుకే నేను అడిగినప్పుడు మంచిగా పోజ్ ఇవ్వమంటాను అంటూ సరదాగా అన్నది. అయితే ఈ కన్వర్​జేషన్​లో ఆనంద్ రష్మికను క్యూట్​గా రుషీ అనడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. విజయ్ దేవరకొండ - రష్మిక మధ్య ఉన్న బాండింగ్ వల్లే ఆనంద్ - రష్మిక ఇంత క్లోజ్​గా ఉంటున్నారు, ఎంతైనా వదిన కదా అందుకే ఈ క్యూట్ కన్వర్​జేషన్​ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కాగా, ఆ మధ్య బేబీ చిత్రంతో మంచి హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం గం గం గణేశ, డ్యుయెట్​ సహా మరో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. యానిమల్​తో సక్సెస్​ అందుకున్న రష్మిక పుష్ప 2, రెయిన్​ బో సినిమాల్లో నటిస్తోంది.

ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన 'జాతి రత్నాలు' ఫరియా అబ్దుల్లా!

దటీజ్​ రాజమౌళి - ఒక్క నిమిషంలోనే హౌస్‌ఫుల్‌ అయిన జక్కన్న సినిమా తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.