ETV Bharat / entertainment

క్రేజీ న్యూస్​ - రామ్​చరణ్ RC 16లో మరో బాలీవుడ్ స్టార్! - Ramcharan Buchibabu Movie

Ramcharan RC 16 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న RC16 గురించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ బాలీవుడ్ స్టార్ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరంటే?

Ramcharan RC 16 Bollywood Star Amitab Bachan plays key role
రామ్​చరణ్​ RC 16 నుంచి క్రేజీ న్యూస్​ - ఆ బాలీవుడ్ స్టార్ కీలక పాత్రలో!
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 11:46 AM IST

Ramcharan RC 16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్​ సెప్టెంబర్​ రిలీజ్​కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆర్​ఆర్​ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్​చరణ్ నుంచి​ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఇదే. ఈ చిత్రం ఇప్పటికే చాలా లేట్ అయిందని నిరాశగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.

అయితే గేమ్​ఛేంజర్​ తర్వాత రాబోతున్న RC16 చిత్రం నుంచి మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక క్రేజీ అప్డేట్​ వస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దీనికి ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్​ను ఆయన అప్పుడప్పుడు పంచుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్​ను తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

అంతేకాదు ఈ చిత్రంలో రీసెంట్​గా మళ్లీ ఫామ్​లోకి వచ్చిన బాలీవుడ్ స్టార్ యాక్టర్​, యానిమల్ విలన్​ బాబీ దేఓల్​ కూడా నటించే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది. రీసెంట్​గా ఆయన యానిమాల్ చిత్రంలో తన 12 నిమిషాల విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.

RC 16 Amitab Bachan : అయితే ఇప్పుడు ఈ పుకార్లతో పాటు ఆర్​సీ 16కు సంబంధించి మరొక క్రేజీ న్యూస్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో రామ్​చరణ్​ పాన్ ఇండియా స్టార్ కావడం వల్ల ఈ చిత్రంలో నటించే నటినటులను కూడా అన్ని ఇండస్ట్రీలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలనుకుంటుంది చిత్ర యూనిట్. అందుకే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చ్​ను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రంలో మైత్రి మూవీ మేకర్స్​తో కలిసి నిర్మాత సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇంకా ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా నటించే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్య గట్టిగా ప్రచారం సాగింది.

ఈ వారమే OTTలోకి 7 ఆస్కార్ గెలిచిన 'ఓపెన్ హైమర్' - ఇంకా ఏఏ చిత్రాలు రానున్నాయంటే?

స్టూడియో ఫ్లోర్లను తుడిచే స్థాయి నుంచి స్టార్ హీరోయిన్​గా - ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.