ETV Bharat / entertainment

రివ్యూ: రామ్, పూరి ఖాతాలో హిట్ పడిందా?- డబుల్ సిమ్ కార్డ్​ ఎలా పని చేసిందంటే? - Double Ismart Review

Double Ismart Review: రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబినేషన్​లో తెరకెక్కిన సినిమా 'డబుల్‌ ఇస్మార్ట్‌'. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందంటే?

Double Ismart Review
Double Ismart Review (Source: ETV Bharat)
author img

By Yogaiyappan A

Published : Aug 15, 2024, 2:03 PM IST

Updated : Aug 15, 2024, 2:54 PM IST

Double Ismart Review: సినిమా: డబుల్‌ ఇస్మార్ట్‌; నటీనటులు: రామ్‌, సంజయ్ దత్‌, కావ్య థాపర్‌, సాయాజీ షిండే, గెటప్‌ శ్రీను, ప్రగతి, ఉత్తేజ్‌ తదితరులు; దర్శకత్వం: పూరి జగన్నాథ్‌; సంగీతం: మణిశర్మ; సినిమాటోగ్రఫీ: జియానీ, శ్యామ్‌ కె.నాయుడు; ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌; నిర్మాత: పూరి జగన్నాథ్‌, ఛార్మి; రచన, విడుదల: 15-08-2024

ఉస్తాద్ రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ఇది సీక్వెల్​గా తెరకెక్కింది. తొలి భాగం హిట్ అవ్వడం వల్ల సీక్వెల్​పై భారీగా అంచనాలు ఏర్పాడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్, పూరికి డబుల్ ఇస్మార్ట్ విజయాన్ని ఇచ్చిందా?

క‌థేంటంటే: బిగ్ బుల్ (సంజ‌య్‌ద‌త్‌) విదేశాల్లో విలాసాల‌తో జీవిస్తూ చీక‌టి సామ్రాజ్యాన్ని న‌డుపుతుంటాడు. భార‌త‌దేశాన్ని ముక్క‌లు చేయాల‌నేది అత‌డి క‌ల. ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ 'రా' అత‌డి కోసం వెతుకుతుంటుంది. ఇంత‌లో బిగ్‌బుల్ మెద‌డులో క‌ణితి ఉంద‌ని, దాని ప్ర‌భావంతో కొన్ని నెల‌లు మాత్ర‌మే బ‌తికే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతారు. మ‌రో వందేళ్ల ప్ర‌ణాళిక‌ల‌తో బ‌తుకుతున్న బిగ్ బుల్ తాను ఎలాగైనా బ‌త‌కాల‌నుకుంటాడు.

అందుకోసం ఆలోచిస్తుండగా మెద‌డులో చిప్ పెట్టుకుని హైద‌రాబాద్‌లో జీవిస్తున్న ఒకే ఒక్క‌డు ఇస్మార్ట్ శంక‌ర్ (రామ్‌) పేరు తెర‌పైకొస్తుంది. బిగ్ బుల్ మెమొరీస్ అన్నీ కాపీ చేసి, ఇస్మార్ట్ శంక‌ర్ మెద‌డులోని చిప్‌లో పేస్ట్ చేస్తారు. దాంతో శ‌రీరం ఇస్మార్ట్ శంక‌ర్‌ది అయినా, ఆలోచ‌న‌ల‌న్నీ బిగ్ బుల్‌వే కాబ‌ట్టి అత‌నికి మ‌ర‌ణం ఉండ‌ద‌నేది వాళ్ల ప్లాన్‌. మ‌రి ఇస్టార్ట్ శంక‌ర్‌లోకి బిగ్ బుల్ ఆలోచ‌న‌లు వ‌చ్చాక ఏం జ‌రిగింది? ఇస్మార్ట్ ఎలాంటి ల‌క్ష్యంతో ఉంటాడు? అత‌డి సొంత జ్ఞాప‌కాలు, అత‌ని ప్రేమ‌, ల‌క్ష్యాలు ఏమ‌య్యాయి? అవన్నీ తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: 'ఇస్మార్ట్ శంక‌ర్' సినిమా సీక్వెల్​కు తగ్గట్లుగానే పూరి కథ సిద్ధం చేసుకున్నారు. ఒక మనిషి మెదడులోకి మ‌రో వ్య‌క్తి వ‌స్తే ఎలా అనే కాన్‌ఫ్లిక్ట్ తొలి సినిమాకి దీటుగానే అనిపిస్తుంది. మరోవైపు ఇస్మార్ట్ పాత్ర‌కు బ్రాండ్‌గా మారిపోయిన రామ్ ఉండ‌నే ఉన్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని ఎక్కువ జాగ్ర‌త్త‌ప‌డ్డారో లేక, త‌న పాత సినిమాల్ని గుర్తు చేయాల‌నుకున్నాడో తెలియదు. సినిమాలో లాగింగ్ ఎక్కువైంది.

త‌న శైలి వేగం, ప‌దును లేని క‌థ‌నంతో చాలా వరకు సినిమా స్లోగా సాగుతున్న ఫీల్ కలుగుతుంది. అలీ కామెడీ కూడా వరౌట్ కాలేదు. దీంతో సినిమా ఏ దశ‌లోనూ ఆసక్తిగా మారదు. పోశ‌మ్మ క‌థ‌ని ప‌రిచ‌యం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ ఎపిసోడ్‌తోనే హీరో ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం కోసం ఎదురు చూస్తున్నాడ‌ని అర్థ‌మైపోతుంది. తొలి సన్నివేశంలోనే దాదాపుగా క‌థ రివీల్ అయిపోయి చాలాసేపు అక్క‌డే ఆగిపోతుంది.

తెర‌పై పాత్ర‌లు ప‌రిచ‌యం అవుతుంటాయి. సీన్స్ సాగిపోతాయి కానీ, ఆడియోన్స్​కు ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్​గా అనిపించదు. హీరో రామ్ త‌న న‌ట‌న, హీరోయిన్‌తో క‌లిసి చేసే అల్ల‌రే కాస్త ఎంటర్టైనింగ్​గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్​లో మ‌లుపులేమైనా ఉంటాయేమోనని ఎదురు చూస్తే అక్క‌డా నిరాశే. హీరో ఎందుకు ప్ర‌తీకారంతో ర‌గిలిపోతుంటాడో, బిగ్ బుల్ ఇండియా రాక వెన‌క ఎవరున్నారో రివీల్ అయ్యే అంశాలు త‌ప్ప మ‌రేదీ ఆక‌ట్టుకోదు! మెమొరీ కాపీ, పేస్ట్ అంటూ కథ సాగిన తీరు అక్కడక్కడ అప‌రిచితుడు పాత్రని గుర్తు చేస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: హీరో రామ్ నటనే సినిమాలో హైలైట్. హుషారైన మేన‌రిజ‌మ్స్‌, డ్యాన్స్‌, డైలాగ్ డెలివ‌రీతో మ‌రోసారి అద‌రగొట్టాడు. కావ్య థాప‌ర్ అందంగా క‌నిపించింది. పూరి సినిమా హీరోయిన్ అనిపించుకుంది. డ్యాన్స్‌, యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ ప్ర‌భావం చూపించింది. ఇక సీనియర్ నటుడు సంజయ్ దత్ పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.

బ‌లాలు

  • రామ్ ఇస్మార్ట్ న‌ట‌న

బ‌ల‌హీన‌త‌లు

  • ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ‌నం
  • సాగ‌దీత‌గా స‌న్నివేశాలు

చివ‌రిగా: పనిచేయని 'డబుల్‌' సిమ్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

'డబుల్ ఇస్మార్ట్' ట్విట్టర్ రివ్యూ- టాక్ ఏంటంటే? - Double Ismart Review

'పూరి ఒక 'గన్​'లాంటోడు'- డైరెక్టర్​పై రామ్ కామెంట్స్ - Ram Double Ismart

Last Updated : Aug 15, 2024, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.