ETV Bharat / entertainment

'రకుల్- జాకీ' వెడ్డింగ్ వీడియో ఔట్- న్యూ కపుల్ సందడి చూశారా? - రకుల్​ ప్రీత్ సింగ్ పెళ్లి వీడియో

Rakul Preet Wedding Video : బాలీవుడ్ స్టార్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్​, జాకీ భగ్నానీ పెళ్లి వేడుకలు గ్రాండ్​గా జరిగాయి. ఇప్పటికే పెళ్లి ఫొటోలు నెట్టింట తెగ వైరల్​ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రకుల్ జాకీ పెళ్లీ వీడియో వచ్చేసింది.

Rakul Preet Wedding Video
Rakul Preet Wedding Video
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 3:29 PM IST

Rakul Preet Wedding Video: బాలీవుడ్ స్టార్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ మూడు ముళ్ల బంధంలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. గోవాలోని ఓ ప్రముఖ హోటల్​లో ఆనంద్​ కరాజ్​, సింధీ స్టైల్​లో వీరి వివాహ వేడుక గ్రాండ్​గా జరిగింది. బంధుమిత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రకుల్​కు ఇండస్ట్రీ ఫ్రెండ్ మంచు లక్ష్మీ ఈ పెళ్లిలో హాజరై సందడి చేశారు.

ఈ క్రమంలోనే పెళ్లి వీడియో కూడా వచ్చేసింది. ఇందులో రకుల్ ప్రీత్- జాకీ భగ్నానీ ఎంత సంతోషంగా ఉన్నారో కనిపిస్తోంది. ఓ సినిమాలో భారీ బడ్జెట్​ సాంగ్‌ రేంజ్​లో ఈ వెడ్డింగ్ షూట్​ చేశారు. ఫ్రెండ్స్​, గెస్ట్స్​ కేరింతల మధ్య రకుల్ హుషారుగా స్టెప్పులేస్తూ జాకీ దగ్గరకు వెళ్తుంది. దండలు మార్చుకునే సమయంలో రకుల్ అల్లరి ఆకట్టుకుంటుంది. ఇక బ్రైడల్ ఎంట్రీ, హల్దీ ఈవెంట్, కపుల్ స్పెషల్ డాన్స్​ ఇలా ప్రతీ ఒక్కటీ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. మరి మీరు ఆ వీడియో చూసేయండి.

మోదీ స్పెషల్ విషెస్: ప్రధాని నరేంద్ర మోదీ రకుల్ ప్రీత్- జాకీ జంటను ఆశీర్వదించారు. పీఎంఓ ఆఫీస్ నుంచి సపరేట్​గా ఓ లెటర్​ను పంపుతూ కొత్త కపుల్​కు విషెస్ చెప్పారు.

Rakul Jacky Prewedding Celebrations : రకుల్ జాకీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా చాలా గ్రాండ్​గా జరిగాయి. పెళ్లికి వచ్చిన అతిథులు సంగీత్​లో సందడి చేశారు. బాలీవుడ్​ కపుల్స్​ వరుణ్‌ ధావన్‌- నటాషా, శిల్పాశెట్టి- రాజ్‌ కుంద్రా ఇలా పలువురు స్టార్స్​ సంగీత్‌లో పాల్గొని స్టెప్పులేశారు. హల్దీ, మెహందీ వేడుకలు కూడా బాగా జరిగాయి. గతంలో ఈ జంట తమ ఫ్రెండ్స్​కు గ్రాండ్ బ్యాచిలరేట్ పార్టీ కూడా ఇచ్చారు. దీంతో పాటు ఈ జంట వెడ్డింగ్ కార్డ్​ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. 'అబ్​ దోనో భాగ్​నా - నీ' ( ఇక ఇద్దరు ఎక్కడికి పరిగెట్టద్దు అని అర్థం, దీంతో పాటు జాకీ భాగ్​నానీ సర్​ నేమ్​ను కూడా ఇందులో మెన్షన్ అయ్యింది) అనే హ్యాష్​ ట్యాగ్​ను ప్రింట్​ చేశారు. సరికొత్తగా ఉన్న ఈ హ్యాష్​ట్యాగ్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ముంబయిలో విశాలమైన బంగ్లా - ఈ కొత్త జంట ఆస్తుల వివరాలు తెలుసా ?

'ఆర్​సీ 16' రోల్​పై జాన్వీ క్లారిటీ​ - 'ఇప్పట్లో దాని గురించి నేనేం చెప్పలేను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.