ETV Bharat / entertainment

లగ్జరీ హోటల్‌లో రకుల్ పెళ్లి - అక్కడ ఒక్క రూమ్ ధర ఎంతంటే ? - రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి

Rakul Preet Singh Marriage : బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్​, స్టార్ హీరో జాకీ భగ్నానీ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. గోవాలోని ఓ ప్రముఖ హోటల్​లో ఈ జంట వివాహ వేడుక గ్రాండ్​గా జరగనుంది. అయితే ఇప్పుడు ఈ హోటల్​కు సంబంధించిన ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఆ విశేషాలు మీ కోసం

Rakul Preet Singh Marriage
Rakul Preet Singh Marriage
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 5:23 PM IST

Rakul Preet Singh Marriage : బాలీవుడ్ క్యూట్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. గోవాలో ఈ జంట ఫిబ్రవరి 21న ఒక్కటికానున్న నేపథ్యంలో ఇప్పటికే వీరి పెళ్లి పనులు జోరుగా జరుగుతున్నారు. ఇరు కుటుంబాలు కూడా బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా నెట్టింట ట్రెండ్ అయిన వాళ్ల పెళ్లి కార్డు కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట ట్రెండ్ అవుతోంది. అదేంటంటే ?

అతిథులకు స్పెషల్ కేర్​ - ఆ హోటల్ రూమ్​ ధర ఎంతంటే ?
సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్​ను తమ పెళ్లి వేదికగా మలుచుకున్నారు రకుల్ , జాకీ జంట. ప్రశాంతమైన వాతావరణం నడుమ సుమారు 45 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన హోటల్​లో మొత్తం 246 గదులు ఉన్నాయట. ప్రముఖ హోటల్ బుకింగ్స్ యాప్ ప్రకారం గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌లో ఒక్కో గది ధర రాత్రికి 19 వేల రూపాయల నుంచి దాదాపు 75 వేల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఇందులో అదనంగా కొన్ని ట్యాక్స్​లు కూడా ఉన్నాయట.

మరోవైపు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఈ పెళ్లి వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్స్​ ప్రారంభం కానున్నాయట. ఇప్పటికే రకుల్, జాకీల వివాహం పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే వాళ్లు ఎవరికీ కూడా ప్రింటెడ్ ఇన్విటేషన్లు ఇవ్వలేదట. దీంతో పాటు అదే విధంగా తమ వివాహ వేడుకలో బాణాసంచాలను నిషేదించినట్లు కూడా తెలుస్తోంది.

Rakul Jacky Wedding Designers : మరోవైపు ఈ జంట పెళ్లి దుస్తుల డిజైనర్లను కూడా లాక్‌ చేశారు. మూడు రోజుల పాటు సాగే ఈ వివాహ వేడుక కోసం రోజుకో డిజైనర్ తయారుచేసిన దుస్తుల్ని ఈ ఇద్దరూ వేసుకోనున్నారట. మనీశ్​ మల్హోత్రా, తరుణ్ తహిల్యానీ, సబ్యసాచి లాంటి స్టార్ డిజైనర్స్ ఈ​ పెళ్లి దుస్తులను రెడీ చేయనున్నారట.

Rakul Jacky Wedding Venue : తొలుత రకుల్​- జాకీ తమ వివాహాన్ని మిడిల్‌ ఈస్ట్‌లో ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పలు ప్రదేశాలను కూడా సెలక్ట్‌ చేశారు. అయితే, గత డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తమ ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నారట. అలా చివరి నిమిషంలో పెళ్లి వేదికను మార్చారని సమాచారం.

వెడ్డింగ్ డెస్టినేషన్​లో మార్పులు - ఆయన కోసమే రకుల్, జాకీ నిర్ణయం!

ట్రెండీగా రకుల్‌ పెళ్లి కార్డు - ఆ హ్యాష్​ట్యాగ్​కు అర్థం ఏంటంటే ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.