OTT Raksha Bandhan Rakhi 2024 Movies : అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు కలిసి ఎంతో ప్రేమగా చేసుకునే వేడుక రాఖీ పౌర్ణమి. తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ రక్షా బంధన్ వచ్చేసింది. దీంతో నేడు(ఆగస్ట్ 19) యావత్ దేశమంతా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇప్పటికే ఆడబిడ్డల రాకతో పుట్టిళ్లు సందడిగా మారాయి.
అయితే ఇలాంటి సమయంలో కొంతమంది అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు సరదాగా బయటికి వెళ్లి గడుపుతారు. మరి కొందరు ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకుంటారు. అలా ఇంట్లోనే ఉండేవాళ్ల కోసం మంచి సిస్టర్ సెంటిమెంట్ సినిమాల వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంతకీ అవి ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయో చూద్దాం.
అన్నవరం(జీ5 ఓటీటీ) - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అన్నవరంలో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు. ఈ చిత్రంలో పవన్ చెల్లెలి పాత్రలో సంధ్య నటించారు. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో చూడొచ్చు.
అర్జున్(డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) - సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన అర్జున్ అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన సంగతి తెలిసిందే. రాఖీ పండగ నాడు చూడదగ్గ సినిమాల్లో ఇది కూడా ఒకటి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
గోరింటాకు(జీ5 ఓటీటీ) - రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్నాచెల్లెళ్ల పాత్రల్లో నటించిన మూవీ సూపర్ హిట్ మూవీ గోరింటాకు. కన్నడ చిత్రం అన్న తంగికి రీమేక్ ఇది. ఈ సినిమా చూస్తే ప్రేక్షకులు కన్నీరు పెట్టాల్సిందే. అంతలా ఆడియెన్స్‌ను ఆకట్టుకుందీ చిత్రం. ప్రస్తుతం జీ5 ఓటీటీతో పాటు యూట్యూబ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
రాఖీ(యూట్యూబ్) - జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నచెల్లెళ్ల సెంటిమెంటుతో వచ్చిన ఈ చిత్రాన్ని కృష్ణవంశీ డైరెక్ట్ చేశారు. ఇది యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
పుట్టింటికి రా చెల్లి(యూట్యూబ్) - యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన పుట్టింటికి రా చెల్లి రక్షా బంధన్ రోజు తప్పక చూడాల్సిన సినిమా. ఈ చిత్రం ప్రస్తుతం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
హిట్లర్(యూట్యూబ్) - మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదుగురు చెల్లెళ్ల బాధ్యతలను చూసుకునే అన్నగా ఈ మూవీలో చిరు నటించారు. ఈ సినిమా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే మళ్లీ ఇన్నాళ్లకు విశ్వంభరలో ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా నటిస్తున్నారు చిరు.
మరికొన్ని సినిమాలు - శివరామరాజు, కృష్ణ సంప్రదాయం, పల్నాటి పౌరుషం, రక్త సంబంధం, బంగారు గాజులు, చెల్లెలి కాపురం, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, బ్రూస్ లీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కత్తి, హనుమాన్, వీరసింహారెడ్డి, భోళాశంకర్, బ్రో, పెద్దన్న వంటి సినిమాలు కూడా సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చినవే. ఇవి కూడా ఆయా ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.
హిందీలో కూడా చాలానే తోబుట్టువల సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాలు ఉన్నాయి. రక్షాబంధన్ (జీ5 ఓటీటీ), దిల్ ధడక్‌నే దో (నెట్‌ఫ్లిక్స్), భాగ్ మిల్కా భాగ్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్),సరబ్‌జీత్ (యూట్యూబ్) స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాగా, వీటిలో చాలా వరకు చిత్రాలు ఫ్రీగానే అందుబాటులోనే ఉన్నాయి.
రాఖీ స్పెషల్ - టాలీవుడ్లో రానున్న సిస్టర్ సెంటిమెంట్ సినిమాలివే! - RAKSHA BANDHAN 2024
రాఖీ పండుగ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా జరుపుకోవాలి? ఓన్లీ సొంతోళ్లకే కట్టాలా? - Rakhi Festival 2024