ETV Bharat / entertainment

సూట్​లో సూపర్​ స్టార్స్ - రజనీ, అమితాబ్ లుక్ అదుర్స్​ - Rajinikanth Vettaiyan Movie - RAJINIKANTH VETTAIYAN MOVIE

Rajinikanth Vettaiyan Shooting : 'తలైవర్ 170'గా తెరకెక్కుతున్న వేట్టయాన్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో అమితాబ్​ బచ్చన్​తో పాటు రజనీకాంత్ స్టైలిష్ లుక్​లో సందడి చేశారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.

Rajinikanth Vettaiyan Shooting
Rajinikanth Vettaiyan Shooting (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 7:36 PM IST

Rajinikanth Vettaiyan Shooting : సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'వేట్టయాన్' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. అయితే తాజాగా సెట్స్​లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్, అలాగే రజనీ కలిసి ఈ సినిమా చిత్రీకరణలో సందడి చేశారు. సూట్స్​ ధరించి క్లాసీ లుక్​లో కనిపించారు. ఫొటోలకు ఫోజులిచ్చి కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతోంది.

సినిమాల్లో కాకుండా ఈ ఇద్దరి ఆఫ్​ స్క్రీన్​ ఫ్రెండ్​షిప్ గురించి అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు ఈవెంట్స్​లో తళుక్కుమన్నప్పుడు రజనీ, అమితాబ్ కలిసి ముచ్చటించిన సందర్భాలు ఉన్నాయి. ఇక రజనీ గతంలో 'హమ్'​ అనే బాలీవుడ్ సినిమాలో కలిసి నటించారు. 1991లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో మాసివ్ సక్సెస్​ అందుకుంది. ఆ సినిమా తర్వాత ఈ ఇదరూ కలిసి ఒక్క సినిమా చేయలేదు. ఇప్పుడు దాదాపు 33 తర్వాత వాళ్లు 'వేట్టయాన్' ద్వారా మళ్లీ సిల్వర్ స్క్రీన్​పై సందడి చేయనున్నారు. దీంతో అభిమానుల్లోనూ ఈ ద్వయంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Vettaiyan Movie Cast : ఇక 'వేట్టయాన్' సినిమా విషయానికి వస్తే - తలైవర్ 170గా రూపొందుతున్న ఈ మూవీలో రజనీ, అమితాబ్​తో పాటు మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌, టాలీవుడ్​ స్టార్ హీరో రానా దగ్గుబాటి, మలయాళ స్టార్ హీరో ఫహాద్​ ఫాజిల్​ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్​ సంస్థ బ్యానర్​పై లైకా సుభాస్కరన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 'జై భీమ్' ఫేమ్ డైరెక్టర్ జ్ఞానవేల్ ఈ సినిమాకు డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్​ రవిచందర్ చక్కటి బాణీలను అందిస్తున్నారు.

మరోవైరు రజనీ ఈ సినిమాతో పాటు తలైవర్ 171గా తెరకెక్కుతున్న కూలీ సినిమాలోనూ నటిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక అమితాబ్​ కూడా 'కల్కి2898 AD ' సినిమాలో నటిస్తున్నారు.

Thalaivar 170 : ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్లు.. ఫ్యాన్స్​కు పండగే!

తలైవా 171 లేటెస్ట్ బజ్- రజనీ సినిమాలో టాలీవుడ్ 'కింగ్'! - Thalaivar 171

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.