ETV Bharat / entertainment

తెరపైకి రజనీ బయోపిక్​ - బాలీవుడ్ నిర్మాత భారీ ప్రయత్నాలు - Rajinikanth Biopic - RAJINIKANTH BIOPIC

Rajinikanth Biopic : కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్​పై బయోపిక్ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్​కు చెందిన ఓ స్టార్ నిర్మాత తన బ్యానర్​పై నిర్మించేందుకు రెడీ అయ్యారట. ఆ విశేషాలు మీ కోసం.

Rajinikanth Biopic
Rajinikanth Biopic
author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 6:11 PM IST

Rajinikanth Biopic : శివాజీ రావ్ గైక్వాడ్ అంటే అంతగా తెలియకపోవచ్చు కానీ, సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే అందరూ ఇట్టే గుర్తుపడుతారు​. ఈ పేరు సౌత్​, నార్త్​లోనే కాదు ఓవర్సీస్​లోనూ పాపులరే. ఆయన స్టైల్​, డైలాగ్ డెలివిరీకి ఫిదా అయ్యే ఫ్యాన్స్​, అప్పుడప్పుడు ఆయనలా మారిపోతుంటారు. ఆయన మేనరిజం ఫాలో అవుతుంటారు. ఓ బస్ కండక్టర్ స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నింటినీ ఆయన అలవోకగా పండిస్తారు. ఆరుపదుల్లోనూ ఎంతో గ్రేస్​తో డ్యాన్స్ చేస్తారు. అయితే 90స్​​ నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఆయన్ను సిల్వర్ స్క్రీన్​పై చూశాము. అయితే ఇప్పుడు ఆయనలా మరోకరు స్క్రీన్​పై కనిపించున్నారట. అదేంటని అనుకుంటున్నారా? త్వరలో ఆయన బయోపిక్​ను తెరకెక్కించే ప్లాన్స్ జరుగుతున్నాయట.

బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాద్​వాలా రజనీ బయోపిక్​ను స్క్రీన్​పై చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్​తో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. అంతే కాకుండా ఇటీవలె చెన్నైలోని రజనీ నివాసానికి సాజిద్ వెళ్లి కలుసుకోవడం వల్ల ఈ రూమర్స్​కు ఇంకాస్త బలం చేకూరింది. ప్రస్తుతం సాజిద్​ 'సికిందర్' అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీంతో ఈ సినిమా తర్వాత ఆయన రజనీ బయోపిక్ మీద వర్క్ చేస్తారని సమాచారం.

మరోవైపు రజనీకాంత్ బయోపిక్​లో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కోలీవుడ్ హీరో ధనుశ్​ పేరు నెట్టింట బాగా వినిపిస్తోంది. ఆయన అయితే రజినీ బయోపిక్​కు పర్ఫెక్ట్ ఛాయిస్ అని అభిమానులు అంటున్నారు. కానీ ఆయన ఇప్పుడు ఇళయరాజా బయోపిక్ షూట్​లో బిజీగా ఉన్నందు వల్ల, ధనుశ్​ కోసం వెయిట్ చేస్తారా ? లేకుంటే ఇంకెవరినైనా తీసుకుంటారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇక 2025 నాటికల్లా ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.

తలైవా 171 లేటెస్ట్ బజ్- రజనీ సినిమాలో టాలీవుడ్ 'కింగ్'! - Thalaivar 171

కేవలం రూ. 2 కోట్ల కలెక్షన్స్ - ఆ ఒక్క సినిమాతో రజనీ బీటౌన్ కెరీర్ డౌన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.