ETV Bharat / entertainment

'ఎన్టీఆర్​ నా ఫ్రెండ్ కాదు - వాళ్లే నా స్నేహితులు' - Rajamouli NTR - RAJAMOULI NTR

Rajamouli NTR Relationship : ఎన్టీఆర్​తో తనకున్న అనుబంధం గురించి మరోసారి మాట్లాడారు జక్కన్న. తారక్​ తన ఫ్రెండ్ కాదని షాకింగ్ కామెంట్ చేశారు!

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 12:49 PM IST

Rajamouli NTR Relationship : రాజమౌళి, ఎన్టీఆర్ కాంబో అంటేనే సూపర్ హిట్. స్టూడెంట్ నెం1తో వీరి ప్రయాణం మొదలై సింహాద్రి, యమదొంగ, ఆర్​ఆర్​ఆర్​ వరకు సాగింది. ఆర్​ఆర్​ఆర్​తో ఇద్దరూ గ్లోబల్ లెవెల్​లో గుర్తింపు సంపాదించుకున్నారు. దర్శకధీరుడైన రాజమౌళితో అత్యధిక సినిమాలు చేసిన ఘనత కూడా ఎన్టీఆర్​కే దక్కుతుంది. చాలా సార్లు వీరిద్దరు తమ మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో కూడా చెప్పారు. అలానే వీరిద్దరు ఇండస్ట్రీలో మంచి స్నేహితులలాగా కూడా కనిపిస్తుంటారు. అయితే తాజాగా మరోసారి జక్కన్న ఎన్టీఆర్​తో తనకున్న అనుబంధం ఎలాంటిదో వివరించారు. కానీ తారక్​ తనకు ఫ్రెండ్ కాదని క్లారిటీ ఇచ్చారు.

వాళ్లే నా ఫ్రెండ్స్​ - సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా కృష్ణమ్మ. ఆ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్​కు గెస్ట్​గా వెళ్లారు రాజమౌళి. అయితే వేదిక మీద ఉన్న జక్కన్నకు ఇండస్ట్రీలో తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని యాంకర్ ప్రశ్న వేసింది. దానికి సమాధానంగా - "ఇండస్ట్రీలో నాకు బాహుబలి, ఈగ చిత్రాలు నిర్మించిన సాయి కొర్రపాటి, శోభు యార్లగడ్డ నాకు మంచి స్నేహితులు. ఎన్టీఆర్ నాకు ఫ్రెండ్ కాదు అంతకన్నా ఎక్కువ అనుబంధం ఉంది మా ఇద్దరికీ. తను తమ్ముడు లాంటివాడు. నాకు స్టూడెంట్ నెం1 అవకాశం రావడానికి కారణమైన రచయిత పృథ్వితేజ కూడా మంచి స్నేహితుడు" అని రాజమౌళి వివరించారు.

ఈ ఈవెంట్ విజయవాడలో జరిగింది. దీనిని ఉద్దేశించి జక్కన్న మాట్లాడుతూ "విజయవాడ అనగానే నాకు గుర్తుకు వచ్చేది కనకదుర్గమ్మ గుడి. నేను స్కూల్లో చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ గోదావరి జిల్లా వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వాళ్లు భోజనం ఎక్కువగా పెట్టేవారు" అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అందుకే ఇక్కడికి వచ్చాను - "ఈ ఈవెంట్​కు రావడానికి ముఖ్య కారణం ఈ చిత్రాన్ని కొరటాల శివ సమర్పించడం. అందుకే ఈ మూవీపై నా దృష్టి పడింది. డైరెక్టర్ గారు నిజాయితీగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందు ఉంచారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఇంట్రెస్టింగ్​గా కనిపిస్తున్నాయి. సత్యదేవ్ నటన గురించి చెప్పాల్సిందేమి లేదు. ఏ పాత్రనైనా సులభంగా చేస్తాడు. అతన్ని స్టార్ చేసే కంటెంట్ ఉంది ఇందులో. ఈ మూవీ తప్పకుండా హిట్ కావాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించారు. కాగా, వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మే 10న విడుదల కానుంది.

'అలాంటి సినిమాలు చూడటమంటే ఇష్టం' - Pawan Kalyan Favourite Movies

'ఆ దర్శకుడిని ముసుగేసి కొడితే రూ.10 వేలు'- జక్కన్న షాకింగ్ ఆఫర్! - Rajamouli

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.