Rajamouli Mahesh Babu Movie : దర్శకథీరుడు రాజమౌళి, మిల్క్ బాయ్ మహేశ్ బాబు తాను చెప్పకుండానే తన బ్యానర్లో సినిమాను ప్రకటించారని చెప్పుకొచ్చారు ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ. వాళ్లిద్దరూ ఎన్నో ఏళ్ల క్రితం తనకిచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారని వారిపై పొగడ్తల వర్షం కురింపించారు.
"నిజానికి నేను చెప్పకపోయినా నా బ్యానర్ అయిన దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో మూవీ తీయనున్నట్లు వారు ప్రకటించారు. ఇచ్చిన మాట గుర్తుంచుకుని నాతో సినిమాను తీస్తున్నందుకు వాళ్లకి నేను కృతజ్ఞుడను. రాజమౌళికి హాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా వాటిని కాదనుకుని నా కోసం"SSMB 29" సినిమా చేస్తున్నారు" అని సంతోషం వ్యక్తం చేశారు నారయణ.
కాగా, కేఎల్ నారాయణ నిర్మాణంలో క్షణక్షణం, హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంతోషం, రాఖీ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరమీదకొచ్చాయి. మళ్లీ కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆయన "SSMB 29"(వర్కింగ్ టైటిల్) సినిమాకు నిర్మాతగా వ్యవహరించనుండటం విశేషం. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేస్తూ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అందుకే సైలెంట్‌గా ఉండిపోయా - వాస్తవానికి రాజమౌళి, మహేశ్ బాబు, కేఎల్ నారాయణ కలిసి సినిమా తీయాలని 15ఏళ్ల క్రితమే అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన నిర్మాతగా విరామం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాజమౌళి, మహేశ్ బాబు ఇద్దరు కెరీర్లో చాలా ఎత్తుకు ఎదిగిపోయినందున ఆయన సైలెంట్‌గా ఉండిపోయారని వివరించారు. కానీ వాళ్లిద్దరూ మాత్రం అప్పుడు తనకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు సినిమాను ప్రకటించి ఆశ్చర్యపరిచారని చెప్పుకొచ్చారు.
"ప్రస్తుతం "SSMB 29" ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. వాస్తవానికి నిర్మాతలు సినిమా చర్చల్లో పాల్గొనరు అని ఇండస్ట్రీలో అంతా అంటుంటారు. కానీ అందరు దర్శకులు అలా ఉండరు. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి ప్రతి విషయాన్ని నిర్మాతతో పంచుకుంటారు. సినిమా పేపర్ వర్క్ జరుగుతున్నప్పుడే ఏమైనా సందేహాలున్నాయా అని నిర్మాతలను అడిగి తెలుసుకుంటారు. ప్రతి చిన్న విషయాన్ని రాజమౌళి ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారో దగ్గరుండి చూస్తున్నా" అంటూ దర్శకధీరుడిని కొనియాడారు నారాయణ.
ఇక మహేశ్ బాబు సినిమా విషయానికొస్తే - సినిమా పాత్రకు తగ్గట్టు తనని తాను మలుచుకునే గొప్ప నటుడు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు నారాయణ. "SSMB 29" చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్, లేదా సెప్టెంబరులో సినిమా చిత్రీకరణ ప్రారంభవుతుందని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కనుక "SSMB29" సినిమాను ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. స్టోరి చాలా బాగుంటుందనీ బడ్జెట్ మాత్రం ఇంకా డిసైడ్ చేయనప్పటికీ ఎంత అవసరమైన ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని నారాయణ చెప్పుకొచ్చారు.
'ఆ దర్శకుడిని ముసుగేసి కొడితే రూ.10 వేలు'- జక్కన్న షాకింగ్ ఆఫర్! - Rajamouli