ETV Bharat / entertainment

కొత్త బాహుబలి వచ్చేస్తోంది - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జక్కన్న - RAJAMOULI BAAHUBALI - RAJAMOULI BAAHUBALI

Rajamouli Baahubali Series : మరో కొత్త బాహుబలి రాబోతున్నట్లు ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు దర్శకధీరుడు రాజమౌళి. పూర్తి వివరాలు స్టోరీలో

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 10:10 PM IST

Updated : May 1, 2024, 6:24 AM IST

Rajamouli Baahubali Series : బాహుబలి సిరీస్​ రెండు భాగాలు కూడా బాక్సాఫీస్ ముందు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. రాజమౌళికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చిత్రాలు ఇవి. అయితే బాహుబలి 2 తర్వాత బాహుబలి 3(Baahubali 3 Movie) కూడా వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అలానే బాహుబలి మూవీలో శివగామి పాత్రను బేస్ చేసుకుని ఆనంద్ నీలకంఠన్ రాసిన ' ది రైజ్ ఆఫ్ శివగామి' పుస్తకం కూడా మంచి ఆదరణను దక్కించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే యానిమేటెడ్ సిరీస్ కూడా రాబోతున్నట్లు రాజమౌళి ప్రకటించారు.

ఏ శక్తి అతడ్ని ఆపలేదు - "మహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు, ఈ విశ్వంలోని ఏ శక్తి అతడ్ని ఆపలేదు బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ త్వరలో రాబోతుంది" అంటూ రాజమౌళి తన సోషల్ మీడియా అకౌంట్​లో పోస్ట్ చేసారు. బాహుబలి ప్రమోషన్లు జరిగినప్పుడే ఈ సినిమాలో పాత్రల గురించి మరింత వివరంగా వివిధ రూపాల్లో చెప్పొచ్చని రాజమౌళి చాలాసార్లు చెప్పారు. అందుకే ఇప్పుడు సిరీస్ ద్వారా ప్రతి పాత్ర వెనక ఉన్న కథ గురించి వివరంగా చెప్పబోతున్నారు. ఈ యానిమేటెడ్ సిరీస్​కు సంబంధించిన ట్రైలర్ త్వరలోనే విడుదల కానుందని జక్కన్న తాజా ప్రకటనలో తెలిపారు.

ఈ సిరీస్(Baahubali Series) గురించి స్వయంగా రాజమౌళి ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. సిరీస్ గురించి ఇతర వివరాలు ట్రైలర్ విడుదలయ్యాక తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమౌళి మహేశ్​ బాబుతో ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్లానింగ్ లో ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు హైదరాబాద్​లో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మహేశ్​ బాబు ఫ్యాన్స్​తో పాటు రాజమౌళి ఫ్యాన్స్ కూడా ఈ మూవీ అప్డేట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి మహరాజ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది.

RRRపై హాలీవుడ్ భామ ప్రశంసలు - ఎన్టీఆర్​, ​చరణ్​తో నటించాలని ఉందంటూ! - Anne Hathaway

మేం ముగ్గురం కలిసి సినిమా చేస్తాం : ఖాన్ త్రయం! - Aamir Salman Sharukh

Last Updated : May 1, 2024, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.