ETV Bharat / entertainment

పుష్ప క్లైమాక్స్ షూటింగ్- రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ - Pushpa At RFC - PUSHPA AT RFC

Pushpa Shooting At Ramoji Film City: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ షూటింగ్ క్లైమాక్స్​కు చేరుకుంది. పతాక సన్నివేశాల్ని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్​లో చిత్రీకరిస్తున్నారు.

Pushpa At RFC
Pushpa At RFC (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 1:50 PM IST

Updated : Aug 5, 2024, 2:19 PM IST

Pushpa Shooting At Ramoji Film City: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ మోస్ట్ అవెయిటెడ్ సినిమా 'పుష్ప- 2'. డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్మాత్మకంగా పాన్‌ ఇండియా లెవెల్​లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. దాదాపు 90శాతం సినిమా పూర్తైనట్లు తెలుస్తోంది. తాజాగా క్లైమాక్స్ సీన్స్ షూటింగ్​ హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్​లో హీరో అల్లు అర్జున్ సహా పలువురు నటీనటులు పాల్గొంటున్నారు.

ఆర్‌ఎఫ్‌సీ (Ramoji Film City)లో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ పతాక సన్నివేశాల్ని చిత్రబృందం అత్యంత అద్భుతంగా చిత్రీకరించే పనిలో ఉంది. ఈ షెడ్యూల్​లో హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు హైలైట్‌గా ఉండనున్నాయని మూవీటీమ్ తెలిపింది. ఇక క్లైమాక్స్​ సీన్స్​కు థియేటర్లలో గూజ్‌ బంప్స్‌ రావడం గ్యారెంటీ అంట. డైరెక్టర్ సుకుమార్ బన్నీని ఫుల్ మాస్ క్యారెక్టరైజేషన్​లో తెరమీద చూపించనున్నారట. అంతేకాకుండా 'అల్లు అర్జున్‌ నుంచి మరో బ్లాక్​బస్టర్ లోడింగ్' అంటూ ఫ్యాన్స్​కు ఫుల్​ హైప్ ఇచ్చారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన వీడియో గ్లింప్స్​ పాటలకు భారీ స్పందన లభించింది. ముఖ్యంగా పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. మ్యూజిక్ సంచలనం దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్​పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అవన్నీ నమ్మకండి
ఈ సినిమా గురించి నిర్మాత బన్నీ వాసు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పుష్ప ఫస్ట్ పార్ట్​ సూపర్‌ హిట్టైన తర్వాత సీక్వెల్లో చాలా మార్పులు చేసినట్లు చెప్పారు.'సుకుమార్‌కు 'పుష్ప' ప్రత్యేకమైన సినిమా. సీక్వెల్‌ తీయాలని నిర్ణయించుకున్నప్పుడు కథలో చాలా మార్పులు చేశారు. షూటింగ్‌ ఆలస్యానికి కారణం అదే. దీంతో అల్లు అర్జున్ రానున్న సినిమాల అనౌన్స్​మెంట్ ఇంకాస్త లేట్ అవుతోంది. అయితే ఆగస్టులోనే బన్నీ తదురి ప్రాజెక్ట్‌ల గురించి ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ సినిమా (పుష్ప 2) డిసెంబర్‌లోనే విడుదల అవుతుంది. మూవీ యూనిట్ ఆ పనిలోనే బిజీగా ఉంది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మకండి' అని బన్నీ వాసు తెలిపారు.

పుష్ప ఈజ్​ బ్యాక్​ - షూటింగ్ ఇప్పుడు ఎక్కడ జరుగుతోందంటే?

'పుష్ప 2' ఆలస్యం - అల్లు శిరీష్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​

Last Updated : Aug 5, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.