Sukumar Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. భారతీయ సినీ చరిత్రలోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే మేకర్స్ శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు సుకుమార్ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
ఈ మీట్లో సుకుమార్ తన డైరెక్షన్ టీమ్‌ను పరిచయం చేశారు. ఈ క్రమంలోనే తన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనే సగం సినిమా డైరెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. 'శ్రీమన్ సగం సినిమా డైరెక్ట్ చేశాడు. నిజంగా తనను మెచ్చుకోవాలి. నా టీమ్‌లో అతను ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. సినిమాలో హీరో చిన్ననాటి ఎపిసోడ్, ట్రక్ సీన్ దాదాపు 40శాతం సన్నివేశాలకు శ్రీమనే దర్శకుడు. అయితే డైరెక్టెడ్ బై 'శ్రీమాన్, సుకుమార్' అని వేయాలి. పోరపాటను నా పేరు వేసుకున్నా' అని సుకుమార్ అన్నారు.
" శ్రీమన్ సగం సినిమా డైరెక్ట్ చేశాడు, లెక్కకి డైరెక్టెడ్ బై సుకుమార్ & శ్రీమన్ అని వెయ్యాలి!" - #Sukumar about his Director Dept #Sriman pic.twitter.com/B3X18SWk6w
— Rajesh Manne (@rajeshmanne1) December 8, 2024
అప్పుడే రూ.500 కోట్లు
మరోవైపు, బాక్సాఫీస్ వద్ద పుష్ప ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఈ సినిమా ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రికార్డులు సొంతం చేసుకుంది. రిలీజైన మూడు రోజుల్లేనే వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్ల కలెక్షన్ మార్క్ దాటినట్లు మేకర్స్ సక్సెస్ మీట్లో చెప్పారు. 'నాకు డిస్టిబ్యూటర్లు ఫోన్ చేస్తున్నారు. మూడు రోజుల్లోనే సినిమా రూ. 500 కోట్లు క్రాస్ చేసిందని చెబుతున్నారు' అని ప్రొడ్యూసర్ అన్నారు. అలాగే ఓ పోస్టర్‌తో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వేగంగా రూ.500 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగానూ పుష్ప రికార్డు కొట్టింది.
THE BIGGEST INDIAN FILM is a WILDFIRE AT THE BOX OFFICE and is SHATTERING RECORDS 🔥🔥#Pushpa2TheRule is now THE FASTEST INDIAN FILM to collect a gross of 500 CRORES WORLDWIDE ❤️🔥#RecordRapaRapAA 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2024
RULING IN CINEMAS
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEOs1… pic.twitter.com/63hLxGB29d
నేషనల్ క్రష్ రష్మిక మంధన్నా హీరోయిన్గా నటించగా, డ్యాన్స్ క్వీన్ శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు, అనసూయ తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి, నవీన్ సంయక్తంగా నిర్మించారు.
'పుష్ప 2' ఫీవర్- ఒక్కో టికెట్ రూ.3వేలు- ఎక్కడంటే?
వరల్డ్‌వైడ్‌గా పుష్పరాజ్ రూలింగ్- 'వైల్డ్ ఫైర్' రికార్డులివే