ETV Bharat / entertainment

'పుష్ప' విలన్​కు అంత రెమ్యూనరేషనా? షూటింగ్ క్యాన్సిలైతే ఫైన్​ కూడా! - Fahadh Faasil Remuneration - FAHADH FAASIL REMUNERATION

Fahadh Faasil Remuneration: మలయాళ స్టార్ యాక్టర్​ ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనూ ఆయనకు మంచి ఫేమ్ ఉంది. వరుస హిట్ లు అందుకుంటున్న ఫహాద్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

Fahadh Faasil Remuneration
Fahadh Faasil Remuneration (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 3:04 PM IST

Updated : Jun 17, 2024, 4:24 PM IST

Fahadh Faasil Remuneration: వైవిధ్య చిత్రాలతో ప్రేక్షకుల్లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు ఫహద్‌ ఫాజిల్‌. ఈ మలయాళ సూపర్​ యాక్టర్​ అల్లు అర్జున్‌ 'పుష్ప: ది రైజ్‌' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి భాగంలో భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం పుష్ప- 2లోనూ ఫహాద్ నటిస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో విలన్​గా నటిస్తూనే, మరోవైపు ఇతర చిత్రాల్లో హీరోగా రాణిస్తూ వరుస సక్సెస్​లను అందుకుంటున్నారు. రీసెంట్​గా 'ఆవేశం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సహజ నటుడి రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

రోజుకు ఎంతంటే?
ఫహాద్ ఫాజిల్ రోజుకు రూ.12 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఒకవేళ తాను డేట్లు ఇచ్చి షూటింగ్ క్యాన్సిల్ అయితే అదనంగా మరో రూ.2 లక్షలు ఇవ్వాలని ఈ నటుడు షరతులు విధించారట. అంటే మొత్తంగా రోజుకు రూ.14 లక్షలు అన్నమాట. ఈ విధంగా కండీషన్స్ పెట్టడం వల్ల తన డేట్లు వృథా అయ్యే అవకాశం ఉండదని ఫహాద్ భావిస్తున్నారట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప-2 కి కూడా ఫహాద్ ఫాజిల్ రోజుకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. ఫహాద్ ఫాజిల్ రెమ్యునరేషన్ లెక్కలు విని నెటిజన్లు షాకవుతున్నారు. ఒకరోజుకు ఫహాద్ ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా అని ఆశ్చర్యపోతున్నారు.

వరుస సినిమాలతో బిజీ
లోకేశ్ కనగరాజ్‌ దర్శకుడిగా సూపర్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ సినిమాలో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేశ్ విక్రమ్ సినిమాలోలానే మరోసారి ఫహాద్ కోసం శక్తిమంతమైన పాత్రను సిద్ధం చేసినట్లు సమాచారం. కాగా, ఫహాద్ ఫాజిల్ ప్రస్తుతం బన్నీ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప-2 లో నటిస్తున్నారు. బ‌న్వ‌ర్ సింగ్​గా మొదటి భాగంలో కాసేపే కనిపించి అలరించిన ఆయన ఇప్పుడు రెండో భాగంలో ఎక్కువ సేపు కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా, పుష్ప-2 సినిమా దేశవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ, ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.

'పుష్ప 2' వాయిదా కన్ఫామ్!​ - క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్ టీమ్​ మెంబర్​ - Pushpa 2 Release Date Postponed

'పుష్ప 2' స్పెషల్ సాంగ్ కోసం ​రామ్​చరణ్ హీరోయిన్​

Last Updated : Jun 17, 2024, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.