Pushpa 2 Telugu Pre Release : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చెన్నై, కోచి నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు బన్నీ, హీరోయిన్ రష్మిక మంధన్నా హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అలాగే శుక్రవారం ముంబయిలో పుష్ప టీమ్ ప్రెస్‌మీట్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకు తేదీని కూడా ఫైనలైజ్ చేశారని టాక్. డిసెంబర్ 1న కార్యక్రమం జరగనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్ వేదిక కానున్నట్లు తెలుస్తోంది. దీనిని మేకర్స్ కూడా శనివారంలోపే అధికారికంగా ప్రకటించనున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇక ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగినట్లు భద్రత కూడా పటిష్ఠంగా ఏర్పాటు చేయనున్నారు.
ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్
ఇదివరకు పలు భాషల్లో జరిగిన ఈవెంట్లకు డైరెక్టర్ సుకుమార్ హాజరు కాలేదు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల సుకుమార్ రాలేక పోయారు. అయితే తెలుగు ఈవెంట్‌కు మాత్రం సుకుమార్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఈ ఈవెంట్‌కు ఆయనే స్పెషల్ గెస్ట్ కానున్నారు. ఈ కార్యక్రమంలో సొంత అభిమానులకు సినిమా గురించి ఆయన మాటల్లో వివరించనున్నారని తెలుస్తోంది.
కాగా, ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాను 12 వేలకుపైగా స్క్రీన్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. డ్యాన్స్ క్వీన్ శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు, అనసూయ తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి, నవీన్ సంయక్తంగా నిర్మించారు.
నాట్ ఓన్లీ వైల్డ్ ఫైర్, ఈసారి ఎమోషనల్ రైడ్ - ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం 'పుష్ప 2'
బన్నీకి రౌడీబాయ్ స్పెషల్ గిఫ్ట్- వీళ్ల బాండింగ్ సూపరో సూపర్!