Pushpa 2 Release Date : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'పుష్ప: ది రూల్'. పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం 2021 చివర్లో రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న 'పుష్ప 2'పై భారీగా అంచనాలు పెరిగాయి. దీని కోసం వరల్డ్ వైడ్‌గా ఉన్న సినీ ప్రియులందరూ రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సెకండ్ పార్ట్‌ను 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలోనే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ, అనుకోని విధంగా ఆ మధ్య 'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్ట్ అయ్యాడు. దీంతో అనుకున్న సమయంలో చిత్రం విడుదల కాకపోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై చిత్ర బృందం స్పందించింది. 'పుష్ప 2' వాయిదా అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీకే 2024 ఆగస్ట్ 15న పుష్పగాడు థీయేటర్‌లో కనిపిస్తాడని ప్రకటించారు. ప్రస్తుతం ఈ రిలీజ్ డేట్ క్లారిటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంత అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు పుష్ప 2 రిలీజ్ రోజే ఆగస్ట్ 15న బాలీవుడ్లో అజయ్ దేవ్‌గన్ నటిస్తున్న సింగం అగైన్ సినిమా కూడా రిలీజ్ కానుంది.
వాస్తవానికి పుష్ప 2 విషయంలో డైరెక్టర్ సుకుమార్ అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ చేస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉండటం వల్ల అందుకు తగట్టే ప్రతి సీన్ ఉండేలా చిత్రీకరణ చేస్తున్నారు. దీంతో మూవీ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఇక పుష్ప ది రూల్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్(Pushpa 2 OTT Rights) సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీయే ఈ మధ్య తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పింది. థియేటర్లలో రిలీజైన తర్వాత సుమారు 45 నుంచి 60 రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.