Pushpa 2 World Records : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రిలీజ్‌కు ముందే పలు రికార్డులు ఖాతాలో వేసుకున్న పుష్ప రాజ్ విడుదల తర్వాత కూడా అదే జోరు ప్రదర్శిస్తున్నాడు. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా తొలి రోజే రూ.294 కోట్లు వసూళ్లు సాధించి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే పుష్ప క్రియేట్ చేసిన పలు రికార్డులు ఏంటో చూద్దాం!
- రిలీజ్‌కు ముందే బుక్ మై షోలో గంటలో లక్ష టికెట్లు అమ్ముడైన చిత్రంగా రికార్డు నెలకొల్పిన 'పుష్ప2' విడుదల తర్వాత ఆ రికార్డును అదే బ్రేక్ చేసింది. రెండోరోజు కూడా గంటలో లక్షకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి
- తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ.30 కోట్ల షేర్ వసూళ్లు సాధించిన తొలి సినిమాగా 'పుష్ప 2' నిలిచింది
- బీటౌన్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఆత్రుతగా ఎదురుచూశారు. బాలీవుడ్‌లో ఈ మూవీకి ఫస్ట్‌డే ఏకంగా రూ.72 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే హిందీలో తెలుగు సినిమాకు ఇన్ని కోట్లు రావడం ఇదే మొదలు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి
- కర్ణాటకలో 'పుష్ప 2' ఓపెనింగ్ డే రూ.23.7 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఒక తెలుగు సినిమాకు తొలిరోజే అక్కడ ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం
- కేరళలో రూ.6.35 కోట్లతో బాక్సాఫీస్‌ను ఓపెన్ చేశాడు పుష్పరాజ్. 2024లోనే కేరళలో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని మేకర్స్ తెలిపారు
- తమిళనాడులో 'పుష్ప 2' మొదటిరోజు రూ.11 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. తెలుగు డబ్బింగ్ సినిమాకు తమిళనాడులో ఇన్ని కోట్లు రావడం ఇదే తొలిసారి
- నార్త్ అమెరికాలో రెండు రోజుల్లోనే 6 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన సినిమాగా 'పుష్ప 2' రికార్డు నెలకొల్పింది
- ఓవర్సీస్లో ఈ మూవీ ఇప్పటివరకు 8 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించింది. ఇండియన్ సినిమాకు ఇన్ని ఓపెనింగ్స్ రావడం ఇదే తొలిసారి
- నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్లు సాధించిన హిందీ డబ్ సినిమాగా 'పుష్ప2' ఘనత సాధించింది
ఆల్‌టైమ్ రికార్డ్- 'RRR'ను దాటేసిన 'పుష్ప'- ఒక్కరోజే రూ.300 కోట్లు!
బాక్స్‌ఫీస్ వద్ద 'పుష్ప 2' ర్యాంపేజ్ - తొలి రోజు వరల్డ్ వైడ్‌గా ఎంత కలెక్ట్ చేసిందంటే?