Double Ismart Steppa Maar Song : రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆగస్టు 15న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడడంతో ప్రమోషన్స్‌ను ప్రారంభించారు మేకర్స్. ఇందులో భాగంగానే మొదటగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. మొదటి భాగానికి చార్ట్-బస్టర్ ఆల్బమ్, అద్భుతమైన బీజీఎమ్ అందించిన మ్యాజికల్ కంపోజర్ మణిశర్మనే ఇప్పుడు రెండో భాగానికి సంగీతాన్ని సమకూర్చారు.
అయితే ఇప్పుడు తాజాగా స్టెప్ మార్ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మూవీటీమ్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. శివుడు బ్యాక్‌డ్రాప్‌తో చార్మినార్, గోల్కొండ కోట సహా హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో సాంగ్‌ను చిత్రీకరించారు. ఇందులో రామ్ కంప్లీట్ స్టైలిశ్ వైబ్‌లో డ్యాన్స్ చేస్తూ ఓ ఊపు ఉపేశారు. ఆయన స్టెప్స్ సాంగ్‌కు హైలైట్‌గా ఉన్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పాటకు కొరియోగ్రఫీ చేయగా, భాస్కర భట్ల లిరిక్స్, అనురాగ్ కులకర్ణి వోకల్స్‌ను అందించారు. మొత్తంగా ఈ సాంగ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్‌గా మాస్ ప్రేక్షకులకు ఇన్‌స్టంట్ ఎడిక్షన్ ఇచ్చేలా ఉంది.
Double Ismart Release Date : పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా టాలీవుడ్ కమెడియన్ అలీ, మకరంద్ దేశ్‌పాండే, షయాజీ షీండే, జబర్దస్త్ గెటప్ శ్రీను, టెంపర్ శ్రీను, వీజే బన్ని తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇక రీసెంట్గా విడుదల చేసిన డబుల్ ఇస్మార్ట్ టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆగస్ట్ 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. చూడాలి మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్‌కు ఈ చిత్రం ఎంతో కీలకం. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తుందో.
'ఆయన పాటలు మనుషులకు నేస్తాలు - అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్' - Nagarjuna About Sirivennela
ఇది సార్ ప్రభాస్ బ్రాండ్ - ఈ సినిమాల వసూళ్లన్నీ రూ.500 కోట్లుపైనే! - Kalki 2898 AD Collections