ETV Bharat / entertainment

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ - ఆ రోజు నుంచి వరుసగా 'రాజాసాబ్'​ అప్డేట్స్​ - RAJASAAB MOVIE UPDATES

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న రాజాసాబ్‌ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్​ చెప్పిన నిర్మాత ఎస్‌కెఎన్‌.

Prabhas Rajasaab Updates
Prabhas Rajasaab Updates (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2024, 3:02 PM IST

Prabhas Rajasaab Updates : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం రాజా సాబ్‌. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై నిర్మాత శ్రీనివాస కుమార్‌(ఎస్‌కెఎన్‌) ఇంట్రెస్టింగ్​ కామెంట్స్‌ చేశారు. శరవేగంగా షూటింగ్‌ జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు.

"అక్టోబర్​ 23న రాజాసాబ్​కు సంబంధించిన అప్డేట్స్​ మొదలై ఆ తర్వాత వరుసగా వస్తాయి. దీని కోసం దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వ ప్రసాద్‌ ప్లాన్స్​ వేసుకున్నారు. త్వరలోనే రాజాసాబ్‌ అప్డేట్స్​ గురించి వివరాలు చెబుతాం. అక్టోబర్‌ 23 నుంచి రిలీజ్ వరకు రాజాసాబ్‌ ప్రపంచంలోకి ఆడియెన్స్​ను తీసుకెళ్తాం. మీడియా వాళ్లకు కూడా ఆ ప్రపంచాన్ని ప్రదర్శించి చూపిస్తాం. దర్శకుడు మారుతి ఒక్క రోజు కూడా వృథా కాకుండా షూటింగ్ చేస్తున్నారు. వినాయకచవితి, దసరా ఇలా ఏ పండగకు కూడా ఆయన సెలవు తీసుకోలేదు. అలానే కష్టపడుతున్నారు. అనుకున్న సమయంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు" అని చెప్పారు. కాగా, రాజా సాబ్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న (RajaSaab Release Date) థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

RajaSaab Movie Budget : రాజా సాబ్‌ సినిమా విషయాని కొస్తే దర్శకుడు మారుతి - హీరో ప్రభాస్‌ కాంబోలో రానున్న మొదటి చిత్రమిది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వ ప్రసాద్‌ భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. రూ.200 కోట్ల వరకు బడ్జెట్​ ఉంటుందని కూడా ఆ మధ్య ప్రచారం సాగింది. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ హీరోయిన్లుగా ప్రభాస్ సరసన నటిస్తున్నారు.

సలార్, కల్కి 2898 ఏడీ వంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్​ సినిమాల తర్వాత ప్రభాస్‌ నుంచి రాబోతున్న చిత్రం ఇది. పైగా ప్రభాస్​ ఎప్పుడు టచ్ చేయని జానర్​లో హారర్ కామెడీగా రానుంది. సినిమాలో ప్రభాస్‌ సరికొత్త అవతారంలో కనిపించనున్నారని అంటున్నారు. ఆ మధ్య రిలీజైన ప్రభాస్​కు సంబంధించిన స్టైలిష్ గ్లింప్స్​ కూడా ఫ్యాన్స్​ను బాగానే ఆకట్టుకుంది.

'NBK109' క్రేజీ అప్డేట్- బాలయ్య కోసం 2 పవర్​ఫుల్ టైటిల్స్!

'వార్​ 2' - ఎన్టీఆర్​, హృతిక్​తో పాటు మరో ఇద్దరు హీరోలు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.